Breaking News Live: ఎల్లుండి నెల్లూరులో సీఎం జగన్ పర్యటన
AP Telangana Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 26 Mar 2022 10:13 PM
Background
AP Telangana Breaking News Live Updates: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. సాగర నగరం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ (South Coatal...More
AP Telangana Breaking News Live Updates: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. సాగర నగరం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ (South Coatal Railway Zone), వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రత్యేక జోన్ ఏర్పాటుకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో పేర్కొన్న సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో గతంలో కమిటీ వేశారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇలా బదులిచ్చారు. ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్ (విశాఖ రైల్వే జోన్)కు డీపీఆర్ సమర్పించాక కొత్త రైల్వేజోన్, రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటుకు పరిధి, ఇతర అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఈ అంశాలను పరిశీలించడానికి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేశాం. కొత్త రైల్వేజోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించినట్లు’ వివరించారు. ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. మొదటగా ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టి, క్రమంగా అవసరమయ్యే నూతన భవనాల్ని నిర్మించుకోవాలని డీపీఆర్‌లో సూచించారు. ఈ దక్షిణ కోస్తా జోన్ ఏర్పడాలంటే రాయగడ డివిజన్ కూడా ఏర్పాటు కావాలి. కానీ అక్కడ ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో దానిపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఇంధన ధరలు వాహనదారులకు మళ్లీ షాకిచ్చాయి. గత మూడు నెలలుగానిలకడగా ఉన్న ఇంధన ధరలు ఇక్కడ గత మూడు రోజులుగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. 0.91 పైసలు పెరగడంతో నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 26th March 2022) రూ.110.91 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.24 కు చేరింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడంతో భారత్‌లో ప్రభావం చూపుతోంది. ఢిల్లీ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. విజయవాడలో పెట్రోల్ (Petrol Price in Vijayawada 26th March 2022)పై 34 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.112719 కాగా, ఇక్కడ డీజిల్ పై 34 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.98.70 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. 18 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.68 అయింది. డీజిల్‌పై 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.97.69గా ఉంది. చిత్తూరులో పెట్రోల్ పై 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.113.24కి పతనమైంది. డీజిల్ పై 19 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.99.14 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట ధరలకు చేరుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర రూ.280 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200కు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,590 అయింది. వెండి ధర రూ.1000 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.73,800 కు ఎగబాకింది.ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)ఏపీ మార్కెట్లోనూ వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. నేడు రూ.280 మేర పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 26th March 2022) 10 గ్రాముల ధర రూ.52,590 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200కు పుంజుకుంది. రూ.1000 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.73,800 అయింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఎల్లుండి నెల్లూరులో సీఎం జగన్ పర్యటన
ఈ నెల 28న (సోమవారం) నెల్లూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో సీఎం పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 11.30 గంటలకు నెల్లూరు చేరుకోనున్న సీఎం. గొలగమూడి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.