Viral Video:


ఇలా ఎలా బ్యాలెన్స్ చేసిందో..


మన దగ్గర టాలెంట్‌కు కొదవే లేదు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగి ఉంటుంది. సోషల్ మీడియా రాక ముందు ఆ టాలెంట్‌ ఇంటికే పరిమితమయ్యేది. కానీ...సోషల్ మీడియా వచ్చాక టాలెంట్ ఉన్న వాళ్లకు అదో మంచి ప్లాట్‌ఫామ్ అవుతోంది. తామేంటో ప్రపంచానికి చూపించుకోడానికి వీలవుతోంది. ఇలానే...చాలా మంది ప్రతిభావంతులు అందరికీ పరిచయం అవుతున్నారు. తమ ప్రత్యేకతలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదే విధంగా ఓ యువతి తన యునిక్ టాలెంట్‌ను నెటిజన్లకు పరిచయం చేసింది. ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. "ఇదెలా సాధ్యమైంది" అని షాక్‌ అవుతున్నారు. ఇంతకీ ఆ యువతి ఏం చేసిందంటే...కుర్చీపై తలకిందులుగా నిలబడి ఒకేసారి 5 బాస్కెట్ బాల్స్‌తో ఓ ఆటాడుకుంది. కాళ్లు, చేతులు సాయంతో ఫీట్లు చేసింది. Redditలో ఈ వీడియో షేర్ చేయగా...క్షణాల్లో వైరల్ అయిపోయింది. బ్లాక్ టీషర్ట్, గ్రే కలర్ ప్యాంట్ వేసుకున్న యువతి కుర్చీలో తలకిందులుగా ఉండి బాస్కెట్‌ బాల్స్‌తో రకరకలా విన్యాసాలు చేసింది. ముందుగా రెండు పాదాలపై బాల్స్ పెట్టుకుంది. ఆ తరవాత చేతుల సాయంతో మరో మూడు బాల్స్ కిందపడకుండా అందుకుంది. ఆ తరవాతే అసలు ఆట మొదలు పెట్టింది. పాదాలపై ఉన్న బాల్స్‌ని చేతుల్లోకి తీసుకుంటూ...Juggling ఆడేసింది. ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా చాలా జాగ్రత్తగా, పర్‌ఫెక్ట్‌గా ఈ  ఫీట్ చేసింది. వీడియో చివర్లో తన కాళ్లపై ఉన్న బాల్స్‌ని జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుని పక్కన పెట్టేసింది. లాస్ట్‌లో కెమెరా వైపు చూస్తూ విక్టరీ సింబల్ చూపించింది. ఈ వీడియో చూసిన వాళ్లు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. "నేను అలా కుర్చీలో రివర్స్‌లో ఉంటే కచ్చితంగా కింద పడిపోతాను. కానీ...ఈ అమ్మాయి మాత్రం ఇంత పర్‌ఫెక్ట్‌గా ఎలా బ్యాలెన్స్
చేసిందో" అని ఓ నెటిజన్ ప్రశంసించాడు. 



సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది యువకులు స్టీరింగ్‌ వదిలేసి కదులుతున్న కారులోనే పేకాట ఆడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఈ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించిన కారు మహీంద్రా సంస్థ తీసుకొచ్చిన ఎక్స్‌యూవీ 700 (XUV 700) మోడల్‌కి చెందినది. ఈ కారులో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ (ఏడీఏఎస్‌) టెక్నాలజీ ఉంది. ఇది డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటుంది. అనుకోకుండా ఏదైనా అడ్డువస్తే వెంటనే డ్రైవర్‌ని అలర్ట్‌ చేస్తుంది. ఆటోడ్రైవింగ్‌ వెసులుబాటు కూడా ఈ కారులో ఉంది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ యువకులు ఇలా స్టీరింగ్‌ వదిలేసి కదులుతున్న కారులోనే జూదం ఆడటం మొదలు పెట్టారు. పైగా ఇందులో ఎవరూ సీట్‌ బెల్టు పెట్టుకోలేదు. డ్రైవింగ్‌ను పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.






Also Read: Mumbai Bus Accident: ఈ పెద్దాయనది మామూలు అదృష్టం కాదు, బస్ కింద పడినా తప్పించుకున్నాడు - వైరల్ వీడియో