Viral Video:


వెడ్డింగ్ షూట్‌లో..


వెడ్డింగ్ షూట్‌లు ఈ రోజుల్లో ఎంత ఫేమస్ అయిపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెషల్ ప్యాకేజ్‌లతో సినిమా రేంజ్‌లో షూటింగ్ చేస్తున్నారు. వధూ వరులు కూడా వీటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే...ఒక్కోసారి ఇవే వాళ్లను నవ్వుల పాలు చేస్తున్నాయి. ఇటీవల వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వధూ వరులు ఇద్దరూ స్టేజ్‌పై రకరకాల ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగుతున్నారు. చుట్టూ కెమెరా మెన్‌లు ఆ మొమెంట్స్‌ని క్యాప్చర్ చేస్తున్నారు. ఇద్దరూ కాస్త రొమాంటిక్‌గా ఫోజ్ పెట్టారు. కానీ...వరుడు వధువు లెహంగాపై కాలు వేసి తడబడ్డాడు. ఉన్నట్టుండి వధువుపై పడిపోయాడు. ఆ బరువు ఆపుకోలేక వధువు కింద పడిపోయింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జైపూర్ వెడ్డింగ్స్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. "ఇలాంటివి జరుగుతూనే ఉంటాయ్‌. నో ప్రాబ్లమ్. క్యూట్ కపుల్" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "మీ ఇద్దరి లైఫ్‌లో ఇదే బెస్ట్ మొమెంట్" అని మరో నెటిజన్ రెస్పాండ్ అయ్యాడు. ఈ వీడియోకి 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. గతంలో ఎన్నో సార్లు వెరైటీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లు చూశాం. ఓ జంట పొలం పనులు చేస్తూ ఫోటోలు దిగితే..మరో జంట కేవలం దుప్పట్లు కప్పుకుని ఫోటోలు దిగి అప్పట్లో పెద్ద హడావుడే చేసింది సోషల్ మీడియాలో. ఆ తరవాత ఎన్నో జంటలు ఆ ట్రెండ్‌ను కొనసా గించాయి. కొందరు వృద్ధులు కూడా...ఈ మురిపెం తీర్చుకున్నారు. 


 






గతంలోనూ..


గతంలో ఓ జంట తమ ప్రీ వెడ్డింగ్ షూట్‌ని గ్రాండ్‌గానే కాకుండా సినిమా రేంజ్‌లో చేసుకుంది. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల వ్యూస్‌, వేల కామెంట్లు వెల్లువెత్తాయి. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే...ఓ జంట బైక్‌పై కూర్చుంది. ఫోటో షూట్‌ కోసం అరేంజ్ చేసుకున్నారులే అనుకుంటాం. కానీ..అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు ఫోటోగ్రాఫర్. ఓ క్రేన్‌తో ఆ బైక్‌ను గాల్లోకి లేపాడు. అలాగే ముందుకు లాక్కెళ్లాడు. ముందు నుంచి ఫోటోలు, వీడియోలు తీశారు. చూడటానికి ఇదేదో యాక్షన్ మూవీ స్టంట్‌లా ఉంది. కేవలం 13 సెకన్ల ఈ వీడియో ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. పెళ్లి కొడుకు స్టంట్ డైరెక్టర్ అనుకుంటా అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.