Viral girl Monalisa reported FEES for movie, ads will shock you: మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా బోంస్లే కుంభమేళా పుణ్యమా అని సోషల్ మీడియా సూపర్ స్టార్ అయింది. తండ్రితో కలిసి పూసలమ్ముకునే ఆమెను ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆమె ఒక్క సారిగా వైరల్ అయిపోయింది. ఎంతగా అంటే ఆమె సోషల్ మీడియా ఖాతాను ఓపెన్ చేస్తే గంటల్లోనే మిలియన్ల మంది ఫాలోయర్లు వచ్చారు. ఆమె ఫాలోయింగ్ చూసి.. అందం చూసి సినిమాల్లో కూడా చాన్సులు ఇస్తున్నారు. ఆమె తన తొలి సినిమాను అంగీకరించారు. 


ది మణిపూర్ ఫైల్స్ పేరుతో రూపొందుతున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఆ సినిమాకు రెమ్యూనరేషన్ కూడా ఖరారు చేశారు. మొత్తంగా ఇరవై ఒక్క లక్షల రూపాయుల రెమ్యూనరేషన్ చిత్ర నిర్మాత ఖరారు చేశారు. అందులో ఆమెకు లక్ష అడ్వాన్స్ గా ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో ఆ కుటంబం సంతోషంగా ఉంది.  



మోనాలిసా భోంస్లే కూడా తన తొలి సినిమా అవకాశంపై కృతజ్ఞతలు చెబుతూ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నెటిజన్లు అందరూ సూపర్ స్టార్ కావాలని ఆమెను అభినందిస్తున్నారు. 



సింపుల్ మేకప్ తోనే ఆమె అందంగా ఉంటారని ఇక సినీ మేకప్ ఆర్టిస్టులు ఆమెను మరింత అందంగా చూపిస్తారని.. భవిష్యత్ లో సూపర్ స్టార్ అవుతారని అంటున్నారు.                                     


మోనాలిసా కొన్ని జ్యూయలరీ కంపెనీలకు  ప్రచారకర్తగా కూడా పని చేస్తున్నారు. పూసల దండలకు మోడలింగ్ చేస్తున్నారు.           



Also Read:  తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!