Vijay memes in social media:     సోషల్ మీడియా అంటే కేవలం సీరియస్ చర్చలు, ఫేక్ ప్రచారాలే కాదు.. సమకాలీన అంశాలపై సెటైర్లు వేస్తూ వినోదాన్ని పంచే వేదిక కూడా. ప్రస్తుతం తమిళనాట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన నటుడు విజయ్ తరచూ గవర్నర్ ను కలవడంపై నెటిజన్లు మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు. ఫుల్ మెజార్టీ లేకపోయినా రాష్ట్ర గవర్నర్ కార్యాలయం చుట్టూ ఇన్నిసార్లు తిరగడం ఏమిటంటూ మీమ్స్ పేజీలు క్రియేటివిటీకి పదును పెడుతున్నాయి.  

 

 

గవర్నర్ కార్యాలయం వద్ద విజయ్ ఫోటోలను పెట్టి..  సార్, అసలు మీరు ఎప్పుడు వచ్చారో, ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు కానీ, మళ్ళీ వచ్చారు  అంటూ పాత సినిమా డైలాగులతో మీమ్స్ వేస్తున్నారు. మరికొందరు విజయ్ సినిమాలోని లియో ,  మాస్టర్  స్టిల్స్ ను వాడుతూ..  ఏంటో విజయ్ అన్నా.. నువ్వు షూటింగ్ కి వెళ్తున్నావో లేక గవర్నర్ అపాయింట్‌మెంట్ కి వెళ్తున్నావో అర్థం కావడం లేదు  అంటూ సరదాగా ఆటపట్టిస్తున్నారు. 

ఈ మీమ్స్ లో ముఖ్యంగా  వెయిటింగ్ లిస్ట్  కాన్సెప్ట్ వైరల్ అవుతోంది.   విజయ్ , గవర్నర్ భేటీపై వెలువడుతున్న సీరియస్ పొలిటికల్ అనాలసిస్ కంటే, ఈ ఫన్నీ మీమ్స్ కే ఎక్కువ వ్యూస్, షేర్లు వస్తున్నాయి.  

 

 

 సోషల్ మీడియా జనం మాత్రం దీన్ని ఒక  ట్రెండింగ్ కామెడీ షో లా మార్చేశారు. ఏది ఏమైనా, రాజకీయాల్లో సీరియస్ నెస్ మధ్య ఈ మీమ్స్ హడావుడి నెటిజన్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.