రష్మికకు పెళ్లి అయ్యింది. అవును... విజయ్ దేవరకొండతో జరిగింది కదా! మళ్ళీ 'సు ఫ్రమ్ సో' దర్శకుడితో పెళ్లి ఏమిటి? అని అనొచ్చు. దేవరకొండ ఇంటి కోడలు అయ్యింది నేషనల్ క్రష్ రష్మిక. ఇప్పుడు కన్నడ దర్శకుడిని పెళ్లి చేసుకున్నది మరో రష్మిక. ఆ వివరాల్లోకి వెళితే... 

జేపీ తుమినాడ్ వెడ్స్ రష్మికJP Thuminad Weds Rashmika: కన్నడ ప్రేక్షకులకు జేపీ తుమినాడ్ బాగా తెలుసు. ఆయన పాపులర్ యాక్టర్ & డైరెక్టర్. తన చిరకాల స్నేహితురాలు రష్మిక మెడలో ఇటీవల మూడు ముళ్ళు వేశారు.

జేపీ తుమినాడ్, రష్మిక వివాహం మంగళవారం (మే 5న) జరిగింది. మంగళూరులో సాంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సన్నిహితులు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు మాత్రమే హాజరు అయ్యారు. 

Also Read: Rajinikanth - రజనీకాంత్‌పై విజయ్ ఫ్యాన్స్ ట్రోలింగ్... తలైవాది డబుల్ స్టాండర్డ్స్ ఆ?

జేపీ తుమినాడ్, రష్మిక పెళ్లికి ముందు హల్దీ, మెహందీ వేడుకలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో రష్మిక పెళ్లి ఏంటి? అని కొందరు తెలుగు ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అయ్యారు. మ్యాటర్ ఏమిటంటే? ఆ రష్మిక వేరు... ఈ రష్మిక వేరు.

రష్మికతో 14 ఏళ్ల పరిచయం... ఇప్పుడు పెళ్లి!జెపి, రష్మిక పరిచయం ఇప్పటిది కాదు. 'సు ఫ్రమ్ సో' సక్సెస్ తర్వాత వచ్చిన ప్రేమ కాదు. వీళ్ళిద్దరూ 14 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. థియేటర్ (నాటక రంగం) నుంచి సినిమా వరకు వచ్చింది. మొదట స్నేహితులుగా ఉన్నారు. తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది.

Also ReadSathi Leelavathi Review - 'సతీ లీలావతి' రివ్యూ: భర్తను కట్టేసి కొట్టేసిన భార్య... మెగా కోడలు లావణ్య సినిమా హిట్టా? ఫట్టా?

గతేడాది (2025) విడుదలైన 'సు ఫ్రమ్ సో' (Su From So)తో దర్శకుడిగా జేపీ తుమినాడ్ మంచి గుర్తింపు పొందారు. ఆ సినిమా తెలుగులో కూడా విజయం సాధించింది. ఆ సినిమా కంటే ముందు 'ఒందు మొట్టేయ కథె' (Ondu Motteya Kathe), 'సప్త సాగరాదాచే ఎల్లో - సైడ్ బి' (Sapta Sagaradaache Ello – Side B) సినిమాల్లో జేపీ నటించారు.

Also ReadGodari Gattupaina Movie Review - 'గోదారి గట్టుపైన' రివ్యూ: క్రిస్టియన్ అమ్మాయితో హిందూ కుర్రాడి ప్రేమకథ... సుమంత్ ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?