Bangalore Rapido Lady Viral Video : బెంగళూరులోని జయనగర్‌లో జరిగిన రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ ఒక మహిళా ప్రయాణికురాలిని దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. అయితే ముందుగా ఆ మహిళ రాపిడో డ్రైవర్ తో దురుసుగా ప్రవర్తించినట్లుగా ఇంకో వీడియో వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే ?
ఒక జ్యూయలరీ స్టోర్‌లో పనిచేసే మహిళా ఉద్యోగి, BTM లేఅవుట్ నుండి జయనగర్ 3వ బ్లాక్‌కు రాపిడో బైక్ బుక్ చేసుకుంది. బైక్ డ్రైవర్ సుహాస్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంోత పాటు ట్రాఫిక్ సిగ్నల్‌ల పాటించలేదని దారి మధ్యలో ఆపేయమని కోరింది. దీనితో వారి మధ్య వాగ్వాదం జరిగింది. రైడ్‌ను మధ్యలో ఆపి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. చార్జి రూ. 77 చెల్లించడానికి నిరాకరించింది. హెల్మెట్‌ను తిరిగి ఇవ్వలేదు. దీనితో డ్రైవర్ సుహాస్ ఆమెను చెంపపై కొట్టాడు, దీని వల్ల ఆమె నేలపై పడిపోయింది. ఓ వ్యక్తి దీన్ని రికార్డు చేయడంోత సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మహిళే తనను మొదట కొట్టిందన్న డ్రైవర్
ర్యాపిడో డ్రైవర్ మాత్రం మహిళ తనను మొదట కొట్టిందని, టిఫిన్ బాక్స్‌తో రెండుసార్లు దాడి చేసిందని పేర్కొన్నాడు. మహిళ మొదట డ్రైవర్‌ను కొట్టినట్లు సీసీఫుటేజీ వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత అతను ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.
కేసు నమోదు
జయనగర్ పోలీసు స్టేషన్ లో మొదట నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ (NCR) నమోదు చేసింది. చెంప దెబ్బ తిన్న మహిళ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. కానీ జూన్ 16, 2025న, మహిళ ఫిర్యాదు చేయడంతో, డ్రైవర్ సుహాస్‌పై FIR నమోదు చేశారు.
కర్ణాటకలో బైక్ టాక్సీ సర్వీసెస్ బంద్ పాటిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు బైక్ టాక్సీ సర్వీసెస్‌ను సరైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ లేనందున నిషేధించింది. దీనితో రాపిడో తన బైక్ టాక్సీ సర్వీస్‌ను జూన్ 16, 2025 నుండి నిలిపివేసి, “బైక్ పార్సెల్” సర్వీస్‌ను ప్రారంభించింది.