Anantapur police arrest parents who kidnapped daughter: ప్రపంచంలో తల్లిదండ్రులు అందరూ మంచివారే ఉండరు. కొందరు దారి తప్పి ఉంటారు. అలాంటి వారే అనంతపురం జిల్లాలోని ఈ తల్లిదండ్రులు. వారి కుమార్తె చదువుకుని టీచర్ ఉద్యోగం తెచ్చుకుంది. ఆమె ఉద్యోగం చేసుకుని వెళ్లిపోతే.. ఆమె సంపాదించుకున్న ఆస్తులు తీసుకెళ్లిపోతుందని.. జీతం తన కుటంబం కోసం ఖర్చు పెట్టుకుంటుందని చెప్పి పెళ్లి చేయడం మానేశారు. చివరికి ఆమె వయసు అయిపోతోందని.. ప్రేమ పెళ్లి చేసేసుకుంది. అయితే ఆస్తులు పోతాయని ఆమెను కిడ్నాప్ చేసి.. బెదిరించారు. కానీ పోలీసులుక చిక్కారు.
30 ఏళ్లు దాటినా కుమార్తెకు పెళ్లి చేయని తల్లిదండ్రులు
బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామానికి చెందిన ఏరిస్వామి ,అదే గ్రామానికి చెందిన తన భార్య మారుతమ్మను ఎవరో కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో అసలు కిడ్నాప్ చేసింది తలిదండ్రులేనని స్పష్టమయింది. 2016 నుండి టీచర్ గా ఉద్యోగం తెచ్చుకున్న మారుతమ్మ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన భవిష్యత్ కోసం 15 తులాల బంగారం,అనంతపురంలో ఇంటి స్థలం కొనుగోలు చేసుకుంది. 9 సంవత్సరాల నుండి తనకు పెళ్లిచేయండి అని తలిదండ్రులను అడుగుతూ వస్తోంది. 32 సంవత్సరాల వచ్చినా తలిదండ్రులు పెళ్లిచేయలేదు. పెళ్లి చేసి పంపితే అల్లుడి కి ఆస్తులు చెందుతాయి మా కుటుంబ పోషణ ఎలా అని ఆలోచించారు తల్లిదండ్రులు.
ప్రేమ పెళ్లి చేసుకోవడంతో ఆస్తులు తీసుకెళ్లిపోతుందని కిడ్నాప్
చివరికి మారుతమ్మ... తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో పడి పెళ్లిచేసుకుంది. ఇది తల్లిదండ్రులకు నచ్చలేదు. కంబదూరు మండలం కురాకుల పల్లి నుండి విధులు అనంతరం భర్తతో కలసి స్వగ్రామని ద్విచక్రవాహనంపై వస్తుండగా పథకం ప్రకారం తండ్రి రహదారి పై కాపు కాచి బొలెరో వాహనంలో కిడ్నాప్ చేసి బెంగుళూరులోని బంధువుల ఇంటికి తరలించి అక్కడే బందించి చిత్రహింసలకు గురిచేశారు. గత కొన్ని రోజులు క్రితం పిల్లలు ఉన్న చెల్లెలి భర్తను అయిన పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి కి గురి చేశారు. ఆస్తులకోసం పన్నాగం పన్నారు.
అరెస్ట్ చేసిన పోలీసులు
తన పై ఉన్న ఆస్తులను రాసివ్వలని తీవ్ర ఒత్తిడి గురిచేశారు. ససేమిరా అంటే కన్న కూతురిని తలిదండ్రులు హతమార్చాలని చూశారు. కుటుంబ సభ్యులను తెలివిగా బోల్తా కొట్టించి మీరూ ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పడంతో బెంగుళూరు నుండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో వాహనాల తనిఖీలో బేలెరో అందులోని మనుషులు పై అనుమానం వచ్చి తనిఖీ చేయగా కత్తి స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. వారిని విచారించగా కుటుంబ సభ్యులు కుట్రలు బట్టబయలు అయ్యాయి.