Anant Ambani Customized Rolls Royce Cullinan: భారతదేశంలోనే కాదు, ప్రపంచ ధనికుల్లో ఒకటైన అంబానీ కుటుంబం విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ను ఎంజాయ్‌ చేస్తుంది. అంబానీ కుటుంబ సభ్యుల ఒంటిపై కనిపించే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇంకా.. ఈ కుటుంబ సభ్యుల ప్రయాణాల కోసం Antilia (ముకేష్‌ అంబానీ 27 అంతస్తుల నివాసం భవనం పేరు) గరాజ్‌లో చాలా లగ్జరీ కార్లు (Ambani family luxury car collection) రెడీగా ఉంటాయి. ఈ కుటుంబానికి రోల్స్ రాయిస్‌ కల్లినన్ కార్లు అంటే ఎంత క్రేజ్‌ అంటే, ఈ ఫ్యామిలీ వద్ద 10 రోల్స్ రాయిస్ కల్లినన్లు ఉన్నాయి, అవన్నీ దేనికదే ప్రత్యేకమైనవి.

కార్టోక్ రిపోర్ట్‌ ప్రకారం, అంబానీ ఇంటి గరాజ్‌లో ఒక రోల్స్ రాయిస్ కల్లినన్ కారుకు ఇటీవల పెయింట్‌ చేయించారు, దీనికోసం కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఈ రోల్స్ రాయిస్ కారు, ముఖేష్ అంబానీ కుమారుడు ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ సొంతం.   

కస్టమైజ్డ్‌ కార్లను ఉపయోగిస్తున్న అంబానీ కుటుంబంమీకు రోల్స్ రాయిస్ కార్ల గురించి మీకు ఒక విషయం తెలియాలి. ఈ కార్లు కస్టమైజ్డ్‌ మోడల్స్‌గా వస్తాయి. అంటే, కారు కొనే వ్యక్తి తన అభిరుచి & అవసరాలకు అనుగుణంగా ఈ కారులో మార్పులు చేయించుకుంటాడు. కారు తయారయ్యే సమయంలోనే, ఫ్యాక్టరీలోనే ఈ మార్పులు జరుగుతాయి, కస్టమైజ్డ్‌ మోడల్‌గా కారు ఉత్పత్తి జరుగుతుంది. అంటే, ప్రతి రోల్స్‌ రాయిస్‌ కారు దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. అంబానీ కుటుంబ సభ్యులు, తమ రోల్స్ రాయిస్ కార్లలో కస్టమైజ్డ్‌ ఫీచర్ల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుంటారు, ఇది ఎప్పుడూ కనిపిస్తుంది. ఈ కస్టమైజ్డ్‌ ఫీచర్లలో ఒకటి పెయింట్ జాబ్, దీనిని రూ. 1 కోటి ఖర్చుతో పూర్తి చేశారు.     

గత ఏడాది (2024) జులై 12న, అనంత్‌ అంబానీ - రాధిక మర్చంట్‌ వివాహం జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఆ సమయంలో, అనంత్ అంబానీ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నప్పుడు అందరి దృష్టి అతని రోల్స్ రాయిస్ కారుపైనే ఉంది. రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోవడానికి అనంత్ అంబానీ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్‌లో వచ్చారు.     

రోల్స్ రాయిస్ కల్లినన్ వేగం & ఇంజిన్ పవర్‌రోల్స్ రాయిస్ కల్లినన్ 5 సీట్ల లగ్జరీ SUV కారు, ఇది దేశంలో మొత్తం 11 రంగులలో లభిస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. కంపెనీ లెక్క ప్రకారం, ఈ కారు లీటరుకు కేవలం 6.6 కి.మీ. మైలేజీ మాత్రమే అందిస్తుంది. అలాగే, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే ఈ కారు లభిస్తుంది.         

రోల్స్ రాయల్ కల్లినన్ ఇంజిన్ విషయానికి వస్తే.. కంపెనీ ఈ అల్ట్రా లగ్జరీ కారులో 6,749 cc శక్తిమంతమైన ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 563 bhp పవర్‌ను & 850 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది.