Black Panther Video: ఓ IFS అధికారి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలోని ఓ ఇంట్లోకి బ్లాక్‌పాంథర్ కనిపించింది. ఆ ఇంట్లోని సీసీ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. గతేడాది ఆగస్టులో ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ వీడియోని షేర్ చేశారు IFS అధికారి ప్రవీణ్ కస్వాన్. ఇంటి ముందు ఆవరణలో బ్లాక్‌ పాంథర్‌ సంచరించింది. 36 సెకన్ల ఈ వీడియో అందరి వెన్నులో వణుకు పుట్టించింది. "ఇలా మీ ఇంట్లోకి ఓ అతిథి వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. నీలగిరి ప్రాంతంలోని ఓ ఇంట్లోని వీడియో ఇది" అని ప్రవీణ్ కస్వాన్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోకి లక్ష వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. "బ్యూటిఫుల్" అని కొందరు కామెంట్ చేస్తుంటే...ఇంకొందరు "చూస్తుంటేనే భయమేస్తోంది" అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో షేర్ చేసినందుకు థాంక్స్ అని మరి కొందరు కామెంట్ చేశారు.