Utter Pradesh wife and her two husbands who are brothers living happily together : మన దేశంలో ఇద్దరు భార్యలతో కాపురం చేసే భర్త అనే న్యూస్ అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇద్దరు భర్తలతో కాపురం చేస్తున్న ఒక్క భార్య అనే మాట మాత్రం ఎక్కడా వినిపించదు. కానీ ఈ రికార్డును బ్రేక్ చేసేసింది యూపీకి చెందిన మహిళ ఒకరు. ఇద్దరు భర్తలతో ఒకే ఇంట్లో హాయిగా కాపురం చేసేస్తోంది. ఇద్దరితో కలిసి గ్రూపు ఫోటోలు దిగుతోంది. ఇంటర్యూలు కూడా ఇస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో దియోరా ప్రాంతానికి చెందిన మహిళ ఒకరు ఇద్దర్ని పెళ్లి చేసుకుంది. వాళ్లిద్దరూ అన్నదమ్ములే. ఒకే ఇంట్లో అందరూ కలిసి ఉంటున్నారు. ఇద్దరు అన్నదమ్ములను పెళ్లి చేసుకున్న ఆ మహిళ దానికి గుర్తుగా.. రెండు మంగళసూత్రాలను కూడా ధరిస్తోంది. ఇద్దరు భర్తలతో మహిళ ఒకే ఇంట్లో జీవిస్తోందని బయట ప్రపంచానికి తెలిసే సరికి అసలు ఎలా సాధ్యమని చాలా మంది ఆమెను పలకరించడానికి వెళ్లారు. అలా వెళ్లిన వాళ్లంతా మీడియానే.
ఓ టీవీ చానల్ కు ఆమె ఇంటర్యూ ఇచ్చారు. ఆమె మాత్రమే కాదు.. ఆమె భర్తలతో కలిసి ఇంటర్యూ ఇచ్చారు. అందులో అసలు ఎలా మెయిన్ టెయిన్ చేస్తున్నారన్నదానికి ... ఆమె గమ్మత్తయిన సమాధానాలు ఇచ్చారు. మా మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందని అన్ని పనులు కలిసే చేస్తామని.. చెప్పుకొచ్చారు. ఇంటి పనుల్లోనూ భర్తలు సహకరిస్తారని.. కలిసే భోజనాలు చేస్తామని ఆమె చెబుతున్నారు.
ఇంతకీ ఇద్దరినీ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మాత్రం ఆమె చెప్పలేదు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం ఏమిటని నోళ్లు నొక్కుకుంటున్నారు. అయితే ఈ లోకంతో మాకు పనేంటి అనుకుంటున్నారు. ఇంటర్యూల్లో ఆ మహిళ గడుసుగా సమాధానాలిస్తోంది కానీ ఆ ఇద్దరు అన్నదమ్ములైన భర్తులు మాత్రం నోరు మెదపడం లేదు. బహుశా అదే వారి మ్యారేజ్ సక్సెస్ సీక్రెట్ కావొచ్చని సెటైర్లు వినిపిస్తున్నాయి.