Yogi Adityanath Swachhata Abhiyan: 


స్వచ్ఛతా అభియాన్..


ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వచ్ఛత అభియాన్‌ (Swachhta Abhiyaan) కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్యలో స్వయంగా తానే చీపురు పట్టుకుని రోడ్లు శుభ్రం చేశారు. అయోధ్య ఉత్సవానికి ముందు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా అభియాన్‌ని చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయనే స్వయంగా నాసిక్‌లోని కాలారాం ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో స్వచ్ఛత (Ayodhya Ram Mandir Opening) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరవాత అయోధ్యలో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ట్రక్స్‌ని ప్రారంభించారు. 






యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులూ ఈ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి మీనాక్షి లేఖి కన్నౌట్‌లోని హనుమాన్ ఆలయంలో స్వచ్ఛత అభియాన్ చేపట్టారు. స్వయంగా చీపురు పట్టుకుని ప్రాంగణమంతా శుభ్రం చేశారు.






గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్‌లోని ఢోలేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రాంగణాన్నిశుభ్రపరిచారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ముందు ఆలయాలు శుభ్రం చేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు వెల్లడించారు.






కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశాలోని మా హింగుళ ఆలయాన్ని శుభ్రపరిచారు. జనవరి 22న అయోధ్య ఉత్సవం ముందు ఇలాంటి క్రతువు చేపట్టడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. హిందువులంతా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. సంక్రాంతి సందర్భంగా దీన్ని మొదలు పెట్టాలని కోరారు.






Also Read: చిన్న దేశమే కదా అని చిన్న చూపు చూస్తే ఊరుకోం - భారత్‌పై మాల్దీవ్స్ అధ్యక్షుడి పరోక్ష విమర్శలు