US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వేదికపై గందరగోళానికి గురైన బైడెన్.. తన ప్రసంగం తర్వాత ఎటువైపు వెళ్లాలో అర్థం కాక తికమకపడ్డారు.
ఇదీ జరిగింది
న్యూయార్క్‌లో గ్లోబల్ ఫండ్స్‌కు చెందిన సమావేశంలో బుధవారం జో బైడెన్ ప్రసంగించారు. అనంతరం పోడియం దగ్గరి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఆగిపోయారు. ఎటువైపు వెళ్లాలో అర్థం కాక తికమకపడ్డారు. అక్కడే ఏదో మాట్లాడినా చప్పట్ల శబ్దంలో అది కూడా వినిపించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరోనా మహమ్మారి గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ 19 కథ ముగిసిందని బైడెన్ ప్రకటించారు. అయితే కొవిడ్‌తో సమస్యలు ఉన్నాయన్నారు. ఇటీవల డెట్రాయిట్‌లో జరిగిన ఆటో షోలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
విమర్శలు
బైడెన్ ప్రకటనపై రిపబ్లికన్లు విమర్శలు చేశారు. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని పొడిగించడాన్ని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి ముగిస్తే మళ్లీ దీనిని పొడిగించడం దేనికి అని ప్రశ్నించారు. వాస్తవానికి వచ్చే నెలతో పబ్లిక్ హెల్త్ ఎమర్జీ సమయం ముగియాల్సి ఉంది. ఒక వేళ ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ముగిస్తే దాదాపు 1.5 కోట్ల మందికి బీమా సౌకర్యం అందదు.
Also Read: Amit Shah On PFI Raids: PFI కార్యాలయాలపై దాడులు- NSAతో అమిత్ షా కీలక భేటీ