అమెరికాలో తరచూ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి కాల్పులు జరిగాయి. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో ఓ బైకర్స్ బార్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఐదుగురు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారని బుధవారం అమెరికా మీడియా రిపోర్ట్స్‌లో వెల్లడించింది.
రిటైరైన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆరెంజ్ కౌంటీ షరీఫ్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ట్రబాకో కెనయాన్ అనే కమ్యునిటీలో కుక్స్ కార్నర్ అనే బైక్స్ బార్ వద్ద ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలోనే నలుగురు చనిపోయారని, మరో ఆరుగురిని ఆస్పత్రికి తరలించారని చెప్పారు. ఐదుగురు వ్యక్తులకు గన్ షాట్స్ తగిలిన గాయాలయ్యాయని వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అధికారులు షూట్ చేశారు.అయితే అతడి పరిస్థితి గురించి స్పష్టమైన వివరాలు లేవు.