Union Budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్-2023ను ప్రవేశపెట్టారు. 2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి.. రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. కిసాన్ సమృద్ధి యోజన తర్వాత ఈ సంవత్సరం ప్రభుత్వం అనేక ఇతర పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. పశు పోషకులు, మత్స్యకారుల కోసం బీజేపీ సర్కారు అనేక చర్యలు తీసుకుంది. సార్వత్రిక బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. ఆర్థిక మంత్రి సహకారంతో రైతుల కోసం అభ్యుదయ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. దీని ద్వారా 63000 అగ్రి సొసైటీలను కంప్యూటరీకరిస్తారు. ఇది రైతులు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. దీంతో పాటు పశుసంవర్ధక, మత్స్య, మల్టీపర్పస్ కార్పొరేట్ సొసైటీల్లో రుణాల మంజూరులో వేగం పెంచుతామని ప్రకటించింది. దీనితో పాటు ప్రధాన మంత్రి మత్స్య పాలన్ యోజనను కూడా ప్రారంభించాలని ఆర్థిక మంత్రి నిర్ణయించారు. అదే సమయంలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కూడా సర్కారు చూస్తోంది. 


చిరుధాన్యాల ప్రపంచ కేంద్రంగా భారత్..


బుధవారం ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారతదేశం చిరు ధాన్యాలకు కేంద్రం అని అన్నారు. పౌష్టికాహారం, ఆహార భద్రత, రైతు పథకాల కోసం చిరుధాన్యాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం శ్రీ అన్న యోజనను ప్రారంభించాలని నిర్ణయించిందని వివరించారు. పోషకాలు అధికంగా ఉండే ధాన్యాల కోసం చిరుధాన్యాల పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆమె వివరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనిని ఆర్థిక కాలానికి తొలి బడ్జెట్ గా అభివర్ణించారు.


2023 బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి చేయూత.. 



  • భారతదేశం తృణ ధాన్యాలకు ప్రపంచ కేంద్రంగా మారుతుంది.

  • రైతులకు పౌష్టికాహారం, ఆహార భద్రత, ప్రణాళిక కోసం తృణ ధాన్యాల ఉపోయోగాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  • శ్రీఅన్నా రాడి, శ్రీఅన్నా బజ్రా, శ్రీఅన్నా రందానా, కుంగ్ని, కుట్టు అన్ని ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

  • మినుము రైతులు ప్రజలకు ఎంతో సహకారం అందించారు.

  • శ్రీఅన్నను హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  • శ్రీఅన్న ప్రొడక్షన్‌కి హైదరాబాద్‌లోని రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి చాలా సాయం అందుతోంది.


సహకార్ సే సమృద్ధి...



  • "సహకార్ సే సమృద్ధి" కార్యక్రమం రైతుల కోసం నడుస్తుంది.

  • దీని ద్వారా 63000 అగ్రి సొసైటీలను కంప్యూటరీకరిస్తారు.

  • ఇది రైతులు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది.

  • పశుసంవర్ధక, మత్స్య రంగాల్లో రుణాలు ఇవ్వడంలో వేగం పెరుగుతుంది.

  • మల్టీపర్పస్ కార్పొరేట్ సొసైటీని ప్రోత్సహిస్తారు.

  • మత్స్య సంపద కోసం కార్పొరేట్ సొసైటీలను కూడా పెంచుతాం.