Ukraine News:


వర్క్ ఆఫ్ ఆర్ట్ అంటూ ట్వీట్..


ఉక్రెయిన్ రక్షణ శాఖ అఫీషియల్ ట్విటర్ పేజ్‌లో ఓ అభ్యంతరకర పోస్ట్ కనిపించడం సంచలనమైంది. కాళీమాతపై వేసిన ఓ అసభ్యకరమైన పెయింటింగ్‌ని పోస్ట్ చేసింది డిఫెన్స్ మినిస్ట్రీ. ఇది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు నెటిజన్‌లు. భారతీయులంతా ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఏంటీ పిచ్చి పెయింటింగ్‌లు అంటూ మండి పడ్డారు. పైగా ఆ పోస్ట్‌లో "Work of Art" అని కోట్ చేయడం మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఓ హాలీవుడ్ నటిని పోలి ఉండేలా కాళిమాత పెయింటింగ్ వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హిందువుల మనోభావాలను దెబ్బ తీశారంటూ విరుచుకు పడ్డారు. అయితే...ఇది పోస్ట్ చేసిన క్షణాల్లోనే విమర్శలు రావడం వల్ల మొత్తానికి ఆ ట్వీట్‌ని డిలీట్ చేసింది డిఫెన్స్ మినిస్ట్రీ. అయినా అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ట్విటర్ వేదికగా ఉక్రెయిన్‌పై వ్యతిరేక పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. 


"కాళిమాతపై అలాంటి అభ్యంతరకరమైన పెయింటింగ్ వేయడం దారుణం. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు కనిపిస్తోంది. మరీ ఇంత నిర్లక్ష్యమా..? ఇలాంటి కంటెంట్‌ని వెంటనే తొలగిస్తే సరిపోదు. క్షమాపణలు కూడా చెప్పాల్సిందే. అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాలి" 


- ఓ ట్విటర్ యూజర్ 


"రష్యా దాడిని తట్టుకోలేక భారత్ మద్దతు అడుగుతున్న ఉక్రెయిన్..భారతీయుల విశ్వాసాలను గౌరవించకపోవడం దారుణం. దేశ సంస్కృతిని విశ్వాసాలను ఇలా దెబ్బ తీయడం దురదృష్టకరం"


- ఓ ట్విటర్ యూజర్ 






మరి కొంతమంది యూజర్స్ ఎలన్ మస్క్‌తో పాటు విదేశాంగమంత్రి జైశంకర్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఉక్రెయిన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వినాశ కాలే విపరీత బుద్ధే అంటూ మరి కొందరు మండి పడుతున్నారు. 




విశ్వగురు అనిపించుకోండి: ఉక్రెయిన్ 


'నిజమైన విశ్వగురు'గా నిరూపించుకోవాలంటే రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని ఆ దేశ విదేశాంగ శాఖ స‌హాయ‌ మంత్రి భారత్‌ను కోరారు. భారతదేశం నిజంగా 'విశ్వగురువు' కావాలని కోరుకుంటే, రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని ఉక్రెయిన్ మొట్టమొదటి విదేశాంగ శాఖ స‌హాయ‌ మంత్రి ఎమిన్ జాపరోవా (Emine Dzhaparova) కోరారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా జ‌పరోవా.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కార్యదర్శి సంజయ్ వర్మతో స‌మావేశ‌మ‌య్యారు. తరవాత ఆమె విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, జాతీయ భ‌ద్ర‌తా ఉప స‌ల‌హాదారు (ఎన్‌ఎస్‌ఎ) విక్రమ్ మిస్రీతో భేటీ అయ్యారు. “ఎందరో ఋషులు, సాధువులు, గురువులకు జన్మనిచ్చిన భూమి - భారతదేశాన్ని సందర్శించడం సంతోషంగా ఉంది. నేడు, భారతదేశం విశ్వగురువు కావాలని కోరుకుంటోంది. మాకు మద్దతునిచ్చి ఆ పేరుని సాకారం చేసుకోండి" అని ఆమె భారత ప్రభుత్వంతో తన మొదటి అధికారిక స‌మావేశం సంద‌ర్భంగా తెలిపారు.


Also Read: President Biden: తనపై తానే సెటైర్లు వేసుకున్న బైడెన్, వయసుపై వస్తున్న విమర్శలకు కౌంటర్