ANI Twitter Locked:
వయసు సరిపోలేదట..
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI అకౌంట్‌ని తొలగించింది ట్విటర్. మీడియా సంస్థలన్నీ దాదాపు ANIపైనే ఆధారపడతాయి. వెరిఫికేషన్ కోసం ఆ పేజ్‌నే చెక్ చేస్తాయి. అలాంటిది ఉన్నట్టుండి ఆ పేజ్ కనిపించకపోయే సరికి కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కాసేపటి తరవాత ANI ఎడిటర్ స్మితా ప్రకాశ్ ట్వీట్ అసలు విషయం ట్వీట్ చేశారు. ట్విటర్ ANI పేజ్‌ని తొలగించిందని వెల్లడించారు. అందుకు వింత కారణం చెప్పినట్టు తెలిపారు. Minimum Age Criteria లేదన్న కారణం చూపుతూ అకౌంట్‌ని తొలగించినట్టు వివరించారు. "This account doesn’t exist" అనే స్క్రీన్ షాట్‌ని షేర్ చేశారు ప్రకాశ్. ట్విటర్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు చెప్పారు.
"ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే కనీసం 13 ఏళ్ల వయసుండాలి. మీ పేజ్ మా రిక్వైర్‌మెంట్స్‌కి తగ్గట్టుగా లేదని మా దృష్టికి వచ్చింది. అందుకే మీ అకౌంట్‌ని లాక్ చేస్తున్నాం. ట్విటర్ నుంచి తొలగిస్తున్నాం"
- ట్విటర్ మెయిల్
ANI అకౌంట్‌ని తొలగించిన కాసేపటికే ప్రకాశ్ ట్వీట్ చేశారు. ఇండియాలోనే అతి పెద్ద న్యూస్ ఏజెన్సీని ట్విటర్ టార్గెట్ చేసిందని అసహనం వ్యక్తం చేశారు.
"ANIని ఫాలో అయ్యే వాళ్లకు బ్యాడ్ న్యూస్. ట్విటర్ మా అకౌంట్‌ని లాక్ చేసింది. 7.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న న్యూస్ ఏజెన్సీ అకౌంట్‌ని తొలగించింది. 13 ఏళ్ల కన్నా తక్కువగా ఉందన్న వింత కారణం చెబుతోంది. అంతకు ముందు గోల్డెన్ టిక్‌ను తొలగించింది. ఆ తరవాత బ్లూ టిక్ ఇచ్చింది. ఇప్పుడు పూర్తిగా లాక్ చేసింది"
-స్మిత ప్రకాశ్, ANI ఎడిటర్