TTD News: జనవరి రెండో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈఓ ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. దర్శన టికెట్లు ఉన్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం చేయిస్తామని పేర్కొన్నారు. టికెట్లు లేని వారిని దర్శనానికి అనుమతి ఉండదని చెప్పారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రోజుకు 25 వేలు, సర్వదర్శనం టికెట్లు రోజుకి 50 వేల టికెట్లను కేటాయిస్తున్నట్లు వివరించారు. వైకుంఠ ద్వార దర్శనం పది రోజులకి 5 లక్షల సర్వ దర్శనం టికెట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. సర్వదర్శన టికెట్ల కోసం తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు, తిరుమలలో ఒక్క కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రోజుకి 50 వేల టికెట్లు కేటాయిస్తామన్నారు. వైకుంఠ ద్వారా దర్శనం మొత్తం 5 లక్షల టికెట్లు కేటాయిస్తామని ఆయన వివరించారు.


టికెట్లు లేని భక్తులు తిరుమలకు రావొచ్చు.. కానీ


రెండు గంటల నుండి టికెట్లు కేటాయిస్తామని ఈఓ సుబ్బారెడ్డి వివరించారు. టోకెన్లు‌ పొందే భక్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేశామన్నారు. ఆర్జిత సేవలు ఏకాంతంగా జరిపిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వ దినాల్లో అన్ని ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో రోజుకి 2 వేల చొప్పున కేటాయిస్తామన్నారు. శ్రీవాణి టికెట్లు కలిగిన వారికి మహాలఘు దర్శనం కల్పిస్తామని వివరించారు. పోలీసులు, జిల్లా అధికారులు భక్తులకు అవసరమైన సౌఖర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గోవింద మాల భక్తులు కూడా టికెట్లు తీసుకునే రావాలన్నారు. వారికి ప్రత్యేక దర్శనాలు ఏమీ ఉండవని చెప్పుకొచ్చారు. టికెట్లు లేని భక్తులు తిరుమలకి రావచ్చు కానీ దర్శనానికి అనుమతి ఉండదని వివరించారు. డిసెంబరు 29వ తేదీ నుండి జనవరి 3వ తేదీ వరకు వసతి రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


పది రోజుల్లో పది వేల మందికి దర్శనం.. 


సీఆర్ఓ వద్ద అదనపు కౌంటర్ లు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. వసతి విషయంలో అవకతవకలు లేకుండా చర్యలు చేపడతామన్నారు. వెనుకబడిన ప్రాంతాల నుండి వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. పది రోజుల్లో పదివేల మందికి దర్శనం చేయిస్తామని వివరించారు. ట్రాఫీక్ ఇబ్బంది , శాంతిభద్రతల ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. జనవరి 2వ తేదీ వేకువ జామున 1:40 నుండి విఐపీ దర్శనం ఉంటుందన్నారు. ఉదయం 5 గంటలకు సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి రెండున వైకుంఠ ఏకాదశి నాడు, బంగారు తెరు, మూడన ద్వాదశి నాడు చక్రస్నానం ఉంటుందని చెప్పారు. టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి రావాలని టీటీడీ సూచించింది. 


నేడు టోకెన్లు లేకుండా దర్శనం.. 


మామూలుగా దర్శనానికి గంటలపాటు కంపార్ట్మెంటుల్లో నిరీక్షించాల్సి ఉంటుంది. చాలా తక్కువ సార్లు వచ్చే సందర్భంలో డైరెక్ట్ లైన్ దర్శనం. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. చేతిలో అసలు టోకెన్ ఏం లేకపోయినా మూడు గంటల్లో దర్శనం చేసుకుని రావడం అనేది చాలా అరుదైన సందర్భం. ఈరోజు ఉదయం తిరుమలలో ఈ పరిస్థితి ఉంది. వీకెండ్‌లో ఈ పరిస్థితి దాదాపు కనిపించదు. కానీ ఇవాళ మాత్రం ఎలాంటి టోకెన్స్‌ లేకుండా డైరెక్ట్‌ లైన్ దర్శనం కల్పించి టీటీడీ. అందుకే ఉదయం స్వామివారి దర్శనానికి వెళ్లేవాళ్లు నిజంగా అదృష్టవంతులని చెప్పవచ్చు.