Breaking News Telugu Live Updates: తెలంగాణ డీజీపీ కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకుల యత్నం
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 04 Jun 2022 02:59 PM
Background
నైరుతు రుతువనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ వారం ఏపీని రుతుపవనాలు తాకనున్నాయి. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, మరోవైపు కొన్నిచోట్ల 2 నుంచి 4 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత...More
నైరుతు రుతువనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ వారం ఏపీని రుతుపవనాలు తాకనున్నాయి. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, మరోవైపు కొన్నిచోట్ల 2 నుంచి 4 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం వరకు సముద్రమట్టంపై 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని చోట్ల, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉత్తర, సెంట్రల్ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలను మరో రెండు రోజుల్లో తాకనున్నాయి. తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నా.. మధ్యాహ్నానికి వేడిగా మారుతోంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ 40, 41 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. నిన్నటితో పోల్చితే నేడు బులియన్ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పుంజుకుంది. రూ.540 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.1500 మేర పెరిగింది. నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,500 అయింది.ఏపీలో పెరిగిన బంగారం ధర.. ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,470 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 కు ఎగబాకింది. రూ.1,500 మేర పుంజుకోవడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.68,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతిలో రూ.540 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.68,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఇంధన ధరలు వరుసగా నాలుగోరోజు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 33 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.54 కాగా, 30 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.97.70 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో ఇంధన ధరలు దిగొచ్చాయి. 19 పైసలు తగ్గడంతో నేడు కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.85 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.97.99 అయింది.