తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(జెన్‌కో)లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ), కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక పరీక్షల తేదీలను జెన్‌కో సంస్థ ఫిబ్రవరి 14న  వెల్లడించింది. ఖాళీల భర్తీకి మార్చి 31న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.00 గంటల నుంచి ఉదయం 10.40 గంటల వరకు మెకానికల్‌/కెమిస్ట్‌ విభాగాలకు, మధ్యాహ్నం 1.00 గంట నుంచి 2.40 గంటల వరకు ఎలక్ట్రికల్‌ విభాగానికి, సాయంత్రం 5.00 గంటల నుంచి 6.40 వరకు సివిల్‌/ఎలక్ట్రానిక్స్‌ విభాగాలకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను పరీక్షకు వారం ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నారు.


తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు గతేడాది అక్టోబరు 5న వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది.


ఉద్యోగాలకు ఎంపికైనవారు సంస్థలో విధిగా 5 సంవత్సరాలు పనిచేయనున్నట్లు సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. రెండళ్లే ప్రొబేషన్ పీరియడ్‌లో ఉద్యోగం వదిలి వెళితే, నష్టపరిహారం కింద అభ్యర్థుల నుంచి రూ.50,000 వసూలు చేస్తారు. ఇక ప్రొబేషన్ పీరియడ్ తర్వాత ఉద్యోగం వదిలి వెళితే.. రూ.1లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైవారికి నెలకు రూ.65,600 - రూ.1,31,220 వరకు జీతభత్యాలు అందుతాయి.


పరీక్ష విధానం:
మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 'సెక్షన్-ఎ'లో అభ్యర్థుల సబ్జెక్టు (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు-80 మార్కులు, 'సెక్షన్-బి'లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు). 


ALSO READ:


పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఎంపిక ఇలా
PNB SO Recruitment: న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank), మానవ వనరుల విభాగం దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1,025 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఖాళీలను అనుసరించి బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 25 లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...