Hyper Aadi Political Entry: హైపర్‌ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. తనదైన కామెడీ పంచ్‌, డైలాగ్‌తో ఆది బుల్లితెర ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే హైపర్‌ ఆది జనసేనాని, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. కార్యక్రమం ఏదైనా పవన్‌పై అభిమానం చూపిస్తూనే ఉంటాడు. ఓ వైపు జబర్దస్త్‌ స్కిట్స్, నటుడిగా రాణిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా జనసేన తరపు ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆది పొలిటికల్‌ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది.  అంతేకాదు అతడు పొలిటికల్ ఎంట్రీ కన్‌ఫాం అయ్యిందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా తన రాజకీయ ఆరంగేట్రం ఆది క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ సభలో ప్రసంగిస్తూ తన పొలిటికల్ ఎంట్రీ, మంత్రి ఆర్కే రోజాతో విభేదాలు అంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు.


రాజకీయం వేరు, జబర్దస్త్ వేరు..


ఈ మేరకు ఆది మాట్లాడుతూ.. "ప్రొఫెషన్‌ వేరు రాజకీయం వేరు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారనం జబర్దస్త్‌. నాకు రోజా గారితో ఎలాంటి గొడవలు లేవు. జబర్దస్త్‌ సెట్స్‌లో రోజా ఎప్పుడు కూడా రాజకీయాల గురించి ప్రస్తావించరు. నాగబబులాగే తన కూడా నన్ను బాగా ప్రోత్సహిస్తుంటారు. జబర్దస్త్‌ కమెడిన్స్‌ ఇంతగా ఎదిగారంటే ఇందులో ఆమె పాత్ర చాలా ఉంది. నాగబాబు గారు ఏవిధంగా ఎంకరేజ్ చేశారో, రోజా గారు కూడా అలాగే ఎంకరేజ్ చేసేవారు. పాలిటిక్స్‌కి వచ్చేసరికి సెపరేట్. నేను అభిమానించేవాళ్లు నాకు ఉంటారు. మేడమ్  అభిమానించేవాళ్లు వేరు ఉంటారు.  రాజకీయం వేరు, జబర్దస్త్ వేరు. అంతే రోజాగారితో పర్సనల్‌గా నాకు ఎలాంటి ఇష్యూస్  లేవు. ఆమె ఎప్పుడు నాతో బాగానే ఉండేవారు. లేడీ జడ్జీలలో రోజా గారు టాప్" అంటూ చెప్పుకొచ్చాడు. 


ఎమ్మెల్యేగా  పోటీ చేస్తా..


అనంతరం మాట్లాడుతూ.. తాను పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్‌ అన్నాడు. అభిమానిగా పవన్‌ స్టార్‌ అనసరించే ప్రతి ఒక్క సిద్ధాంతం నాకు నచ్చుతుంది. ఈ కారణంతోనే ఆయనతో నేను నడవాలనుకుంటున్నాను. పవన్‌ కళ్యాణ్‌ను ఎవరెమన్నా నాకు కోపం వస్తుదంఇ. ఏదైనా అంటే నేను తప్పకుండ రియాక్ట్‌ అవుతాను. ఆయన వ్యక్తిగతంగా ఎవరిని దూషించరు. ప్రజల సమస్యల గురించి మాత్రం పవర్‌ స్టార్‌ ఆలోచిస్తారు. ఆయన గెలిస్తే జానాలకు తప్పకుండా మంచి చేస్తాడు. నేను పదవులు, టికెట్లు ఆశించిన జనసేన సపోర్టు చేయడం లేదు. అయన మీద ఉన్న అభిమానం, పవర్‌ స్టార్‌ సిద్ధాంతాలు నచ్చే జనసేనకు మద్దతు ఇస్తున్నాను" అని స్పష్టం చేశాడు. అయితే, ఒకవేళ తనకు జనసేన టికెట్‌ ఇచ్చి పోటీ చేయమంటే మాత్రం తప్పకుండా చేస్తానంటూ చెప్పాడు. పవన్‌ కళ్యాణ్‌ను గెలిపించడం కోసమైనా తాను గెలుస్తానని, ఈసారి ఎన్నికల్లో జనసేన తరపున క్యాంపైన్‌ చేయడానికి వెళతానని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆది కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. అంటే ఈసారి జనసేన ఎమ్మెల్యే టికెట్‌ ఆదికు కన్‌ఫాం అయ్యేలా ఉందని,  అయితే ఈసారి ఆది ఎమ్మెల్యేగా పోటీ చేయడం పక్కా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.