కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని బాలికల గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 20 Aug 2022 01:25 PM
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని బాలికల గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని బాలికల గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించిన డాక్టర్ ఫుడ్ పాయిజన్ గా నిర్ధారించారు. అయితే 30 మంది విద్యార్థులలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. రెండు రోజుల క్రితం ప్రాథమిక పాఠశాలలో  ఘటన మరవక ముందే గురుకుల పాఠశాలలో బాలికలకు ఫుడ్ పాయిజన్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.15  రోజుల క్రితం గురుకుల పాఠశాలలో విద్యార్థులపై ఎలుకల దాడి మరవకముందే విద్యార్థులకు కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురవడం విద్యార్థులు తల్లిదండ్రులు గురుకుల పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

విజయవాడలో కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

విజయవాడలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. సిటీ సివిల్‌ కోర్టు భవన సముదాయ ప్రారంభానికి ముందు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణను సీఎం జగన్‌ భేటీ అయ్యారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో సీజేఐ జస్టిస్‌ రమణ, సీఎం జగన్‌ కలిసి మొక్క నాటారు. 

ఉప్పల్‌లో భార్యను హత్య చేసిన భర్త- అనాథలైన ఇద్దరు పిల్లలు

హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి కుర్మానగర్ లో దారుణం జరిగింది. భార్య దివ్య (32)ను అతి కిరాతకంగా చంపిన భర్త దీపక్ కుమార్(40). అర్ధరాత్రి జరిగిందీ సంఘటన. ఈ దంపతులకు అనంత్ కుమార్(10), దిషిత(8) అనే ఇద్దరు సంతానం ఉంది. దిలీప్‌కుమార్‌ను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివ్య డెడ్‌ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. గత కొన్ని నెలలుగా భార్య భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థ అనుమానాలే హత్యకు కారణమని తెలుస్తోంది. 

కులుమనాలిలో చిక్కుకున్న విశాఖ కార్పొరేటర్లు

భారీ వర్షాలు కారణంగా కులుమనాలిలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో విశాఖ మన్సిపల్ కార్పొరేటర్లు చిక్కుకున్నారు. కులుమనాలి నుంచి చండీగడ్‌ వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో చిక్కుకున్నారు. ఈ నెల 16 నుంచి స్టడీ టూర్ లో ఉన్నారు విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 95 మంది కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు. 


చండీగఢ్‌కు 240 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. రాత్రి నుంచి రోడ్డుపైనే కార్పొరేటర్లు ఉన్నారు. విషయాన్ని మంత్రి అమర్‌నాథ్‌కి వివరించారు కార్పొరేటర్లు. ప్రభుత్వం తరఫున సహాయక చర్యలు అందేలా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి అమర్‌నాథ్‌ 

Background

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ రోడ్డులో ప్రజాదీవెన సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది టీఆర్‌ఎస్. తెలంగాణ రాజకీయాలకు, రాబోయే ఎన్నికలకు ఇదో కొలమానంగా పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ సభను టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 


అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చిన మునుగోడు ఎన్నికలు పార్టీల స్థితిగతులను తేల్చేయనున్నాయి. ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది.. ఎవరికి ప్రజల మద్దతు ఉంటుందనే విషయంలో స్పష్టం రానుందని భావిస్తున్నాయి పార్టీలు. పార్టీల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఈ ఎన్నికపై చాలా ఆసక్తి నెలకొంది. 


మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ రాకపోయినా పార్టీలు ప్రచారం మొదలు పెట్టేశాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రజలను కలుస్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు మునుగోడులో సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


సమరశంఖం పూరిస్తున్న గులాబీ


మునుగోడులో టీఆర్‌ఎస్ ఓ అడుగు ముందే నిలిచింది. ప్రజాదీవెన పేరుతో భారీ బహిరంగ సభను ఇవాళ నిర్వహిస్తోంది. ఈ సభతో తమ సత్తా చాటాలను గులాబీ దళం గట్టిగానే భావిస్తోంది. అందుకే అమిత్‌షా నిర్వహించే సభ కంటే ముందుగానే మీటింగ్ పెట్టింది. 


హైదరాబాద్‌ నుంచి రెండు వేల కార్లు, ఇతర వాహనాలతో మనుగోడు బహిరంగ సభ వరకు భారీ ర్యాలీ తీస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ లీడర్లు చెబుతున్నారు. అదే స్థాయిలో భారీగా జనసమీకరణ కూడా చేపట్టిందా పార్టీ. 






రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ నుంచి మునుగోడు చేరుకుంటారు సీఎం కేసీఆర్. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడు వస్తారు. ఆయన కాన్వాయ్‌ను వేల మంది పార్టీ శ్రేణులు అనుసరించనున్నారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో జరగనుంది టీఆర్‌ఎస్‌ మనుగోడు ప్రజాదీవెన సభ. చలో మునుగోడు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి నేతలు బయల్దేరనున్నారు. ఈ సభ వేదికగానే కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేలా ప్లాన్ చేశారు గులాబీ నేతలు. 


తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజలకు ఈ సభవేదికగా సీఎం కేసీఆర్ వివరించనున్నారు. తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షను... ఇతర పార్టీ నేతల తీరుపై కేసీఆర్ ప్రసంగించనున్నారు. 






ఇదే వేదికపై టీఆర్‌ఎస్‌ తరఫున మునుగోడులో ఎవరు పోటీ చేయనున్నారో కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.