Tripura Election Results 2023:


మెజార్టీ ఎంత వస్తుందో..? 


త్రిపురలో బీజేపీకి స్వల్ప మెజార్టీ వచ్చింది. 60 సీట్లున్న రాష్ట్రంలో 31 చోట్ల విజయం సాధిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు వీలవుతుంది. బీజేపీ  కూటమి 19 చోట్ల విజయం సాధించి.. మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ దక్కే అవకాశాలున్నాయి. అయితే...అనుకున్న స్థాయిలో మెజార్టీ రాకపోతే Tipra Motha (TP) పార్టీ కీలకంగా మారనుంది. చెప్పాలంటే ఇదే కింగ్‌ మేకర్‌ అవుతుంది. ఇప్పటికే బీజేపీ ఈ పార్టీతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే త్రిపుర బీజేపీ ప్రతినిధి సుబ్రత చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తిప్రా మోత పార్టీ డిమాండ్‌లు అన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ గ్రేటర్ తిప్రలాండ్‌ డిమాండ్‌ను మాత్రం వాళ్లు పక్కన పెట్టేయాలని తేల్చి చెప్పారు. మరోసారి తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నారు. 


"మరోసారి రాష్ట్రంలో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మొదటి నుంచి మేము ఇదే చెబుతున్నాం. కేంద్ర మంత్రులూ ఇక్కడికి వచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు"


సుబ్రత చక్రవర్తి, త్రిపుర బీజేపీ ప్రతినిధి 






తిప్ర మోత పార్టీ మద్దతు తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకూ వివరణ ఇచ్చారు.  "గ్రేటర్ తిప్ర లాండ్‌ అనే డిమాండ్ మినహా వాళ్లు ఎలాంటి డిమాండ్‌లు మా ముందు ఉంచినా నెరవేర్చుతాం" అని తేల్చి చెప్పారు. అయితే...ఈ కండీషన్‌కు తిప్ర మోత పార్టీ అంగీకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే.