ప్రపంచాన్ని కొత్తగా చూడాలానుందా, ఇవి ట్రై చేయండి..!
ఇప్పుడంతా హడావిడి జీవితం. ఉద్యోగం, జీవితం, పెళ్లి, పిల్లలు ఇదే రొటీన్ లైఫ్ స్టైల్. వీటిని దాటి కొంచెం ముందుకు ఆలోచిస్తే కొంచెం విభిన్నంగా జీవితాన్ని గడుపుతున్న వాళ్లు మన కళ్ల ముందే ఉన్నారు. అందరిలానే కంటే జీవితాన్ని వాళ్లు చూసే పర్ స్పెక్టివ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇటీవల అలాంటి లైఫ్ స్టైల్స్ కొంచెం ట్రెండ్ కూడా అవుతున్నాయి. సో అలా ట్రెండ్ అవుతున్న టాప్ 5 లైఫ్ స్టైల్స్ ఏంటో ఓ సారి చూద్దాం.


1. వ్యాన్, క్యారవాన్ (Van Life)
వ్యాన్, క్యారవాన్ ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లైఫ్ స్టైల్. సింపుల్ గా ఓ కార్ ఆర్ వ్యాన్ తీసుకుని అలా రోడ్లపై వెళ్లిపోతూనే ఉఁటారు. కారే కదా ఏముంటాయ్ అనుకోకండి మినిమల్ లైఫ్ స్టైల్ అయినా నీడ్స్ అన్నీ తీర్చేలా క్యారవాన్స్ ను ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. సో వీటిలో రైడ్ చేస్తూ...కావలసిన ప్రదేశాలు తిరుగుతూ లైఫ్ ను లీడ్ చేస్తుంటారన్న మాట. మరి డబ్బులెలా అని ఆలోచించకండి.. ఈ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్లలో చాలా మంది కార్పొరేట్స్ కూడా ఉంటున్నారు. సింపుల్ ల్యాప్ టాప్, అండ్ వైఫై ఉంటే చాలు కదా..ఎక్కడి నుంచి పని చేస్తే ఏంటీ. ఇంకా పెద్ద జాబ్స్ లేకపోయినా ఏదో ఓ ఊరిలో ఆగటం...చేతికి దొరికిన పని చేయటం..డబ్బులు సంపాదించుకోవటం..తిరిగి ట్రావెల్ చేయటం ఇలా నోమడ్స్ లా తిరిగే జీవన విధానం కూడా ట్రెండ్ ఇప్పుడు. అన్నట్లు ఈ కాన్సెప్ట్ మీదే వచ్చిన నోమడ్ ల్యాండ్  సినిమా ఆస్కార్స్ కూడా గెలుచుకుంది మీరు చూశారా.


2. ఫుడ్ లవర్స్ ట్రావెల్ (Travel for Food)
మీకు మార్క్ వీన్స్ తెలుసా... ట్రావెల్ ఫర్ పుడ్ అనే కాన్సెప్ట్ తెలియాలంటే మార్క్ వీన్స్ లాంటి యూట్యూబర్స్ లైఫ్ స్టైల్ అని ఓసారి చూడండి. నచ్చిన ఆహారం ఏ దేశంలో ఉందో వెతుక్కుని అక్కడికి వెళ్లి...ఆ రుచులను ఆస్వాదిస్తూ లైఫ్ ఎంజాయ్ చేయటం ట్రావెల్ ఫర్ పుడ్. ఉన్నదొక్కటే జిందగీ, జిందగీ నా మిలేగీ దుబారా లాంటి కోట్స్ పక్కా గా సరిపోయే లైఫ్ స్టైల్ వీళ్లది. ఉన్నపాటి ఈ జీవితాన్ని హాయిగా నచ్చినవి తింటూ లైఫ్ లీడ్ చేస్తుంటారు ఫుడ్ ట్రావెలర్స్. అఫ్ కోర్స్ వీళ్లకు స్థిరమైన నివాసాలు ఉంటాయి. బట్ ఎక్కువగా ట్రావెల్స్ నే స్పెండ్ చేస్తుంటారు. రకరకాల ఫుడ్స్ ను టేస్ట్ చేస్తుంటారు. తమ జర్నీస్ ను వీడియోలు తీయటం ద్వారా సోషల్ మీడియా ద్వారా రెవెన్యూ సంపాదిస్తూ నచ్చిన విధంగా బతికేస్తుంటారు వీళ్లంతా.



3. ట్రెక్కింగ్ లైఫ్ స్టైల్ (Trecking LifeStyle):
ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ట్రెక్కింగ్ లైఫ్ స్టైల్ ను ఎక్కువగా వీకెండ్స్ కు పరిమితం చేసుకుంటారు ఎక్కువ మంది. కానీ కంప్లీట్ గా ట్రెక్కింగ్ జీవితంలా మార్చేసుకుని బతికే వాళ్లూ ఉన్నారు. మ్యాప్ లో ఓ పాయింట్ చూస్ చేసుకోవటం..అక్కడ కష్టమైన కొండలు, పర్వతాలు చూసుకోవటం...వాటిని సక్సెస్ ఫుల్ గా అధిరోహించటం ఇదే కాన్సెప్ట్. ఇందులో ఏముంది గురూ కిక్కు సర్ కిక్కు. ఈ ప్రపంచంలో మనిషి కాన్ఫిడెన్స్ ను మించిన శక్తి మరేదీ లేదని నమ్మే గుండెబలం ఉన్న మనుషులు వీళ్లంతా. అందుకే ఎండ, చలి, వర్షం అనే కాన్సెప్ట్స్ వీళ్లకు పట్టవు. శిఖరం అంచున నిలబడి ప్రపంచాన్ని జయించినట్లు వీళ్లు పొందే ఫీల్ ఇంకెక్కడుంటుంది చెప్పండి.


4. ఫొటోగ్రఫీతో కొత్త లైఫ్ స్టైల్ (Photography LifeStyle) :
మీరు తమిళ్ లో 96, తెలుగులో జానూ సినిమాలు చూస్తే ఈ లైఫ్ స్టైల్ మీద ఓ ఐడియా ఉంటుంది. చేతిలో మంచి కెమెరా, వెళ్లడానికి ఓ ప్రదేశం ఉంటే చాలు ఇక ఈ ప్రపంచం అంతా మనదే. వాళ్లు తమ గురించి అంతగా పట్టించుకోరు. ప్రకృతిని ఎంత అందంగా కెమెరాలో బంధించాలనే కాన్సెప్ట్ మాత్రమే వీళ్లని వెంటాడుతూ ఉంటుంది. వైల్డ్ లైఫ్ అని, నేచర్ అని, ఆస్ట్రో ఫోటోగ్రఫీ అని ఫోటోగ్రఫీలోనే గంటలు గంటలు గడిపేస్తూ ప్రపంచం అంతా చుట్టేస్తూ ఉంటారు. ఎక్కువగా ఇంట్రోవర్ట్స్ మాత్రమే ఇలా గడపగలరని చాలా మంది అనుకుంటారు కానీ అది కూడా కరెక్ట్ కాదేమో. చాలా మంది జోవియల్ అండ్ లైఫ్ అంటే సింపుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉన్నవాళ్లూ కనిపిస్తారు.


5. మీ మూలాలు వెతకండి (Get back to the Roots)
గెట్ బ్యాక్ టూ ది రూట్స్ అంటే సింపుల్. ఇప్పుడున్న సివిలైజేషన్ ను కాదని... ఓ వంద, రెండొందల ఏళ్లు వెనక్కి వెళ్లి బతికేయటం. ఇప్పుడు మనకున్న లగ్జరీస్ వదిలేసి సింపుల్ గా ఓ రూట్ ప్లేస్ కి లైఫ్ ను లీడ్ చేయటం. అక్కడున్న పరిమిత వనరులు ఎక్కువగా నేచర్ నుంచి లభించే వాటితోనే లైఫ్ ను ముందుకు తీసుకెళ్లటం లాంటివి ఉంటాయి. యూట్యూబ్ లో మిస్టర్ వైల్డ్ నేచర్ లాంటి వాళ్లు ఉంటారు ఓ సారి చూడండి. ఆ లైఫ్ స్టైల్ ఏంటో ఓ ఐడియా వస్తుంది


సో అది. అంటే మనందరం వీళ్లలా లైఫ్ ను లీడ్ చేయాలని కాదు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని డిఫరెంట్ పర్ స్పెక్టివ్స్ లో చూసే మనుషులు ఉన్నారు. లైఫ్ ను మరీ తీసేసుకోకు బాస్. కొంచెం హ్యూమర్ కొంచెం నీకు నచ్చినవి యాడ్ చేసుకో ఫుల్ టూ జిందగీ ని ఎక్స్ పీరియన్స్ చేయగలుగుతున్నావ్ అని చెప్పటమే వీళ్ల ఉద్దేశం కావచ్చు. ఖాళీ దొరికినప్పుడు మీరు కూడా ఈ లైఫ్ స్టైల్స్ ఓ సారి ట్రై చేయండి. రొటీన్ లైఫ్ కు కొంచెం బ్రేక్ లా ఉండి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్చొచ్చు.