Road Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ, మినీ బస్ ఢీకొట్టుకున్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. హవేరి జిల్లాలోని బ్యాడగి వద్ద నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 17 మంది ప్రయాణిస్తున్నట్టు తెలిపారు. స్పాట్‌లో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మైనర్లున్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరిని ICUలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే...ఈ ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులోనే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ట్రక్ రోడ్డు పక్కన ఆగిన సమయంలో బస్ వచ్చి బలంగా ఢీకొట్టినట్టు చెబుతున్నారు. బలంగా ఢీకొట్టడం వల్ల కొందరు రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయారు.
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్ని ఢీకొట్టిన మినీ బస్ - 13 మంది మృతి
Ram Manohar
Updated at:
28 Jun 2024 01:03 PM (IST)
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్ని మినీ బస్ ఢీకొట్టిన ఘటనలో 13 మంది మృతి చెందారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్ని మినీ బస్ ఢీకొట్టిన ఘటనలో 13 మంది మృతి చెందారు.