Tourist bargains Rs 550 bag down to Rs 50: సూపర్ మార్కెట్ లోకి వెళ్తే బేరాలుండవ్. కానీ రోడ్ మీద చిన్న వ్యాపారి ఎవరైనా వస్తువులు అమ్ముతూంటే మాత్రం బేరాలుంటాయి.ఎంత ఘోరంగా ఉంటాయంటే. 90 శాతానికిపైగా డిస్కౌంట్ అడిగేస్తారు.ఇంకా కామెడీగా ఆ అమ్మకం దారులు ఇచ్చేస్తారు.ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
భారతదేశంలో ఒక విదేశీ పర్యాటకుడు ఒక బ్యాగ్ ధరను రూ.550 నుండి రూ.50కి బేరసారాలు చేశారు. యాభై రూపాయలకు ఇస్తానన్నా సరే కొనలేదు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ పర్యాటకుడు మొదట రూ.20కి చిప్స్ ప్యాకెట్ కొంటున్నట్లు కనిపిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత, అతను ఒక స్ట్రీట్ వెండర్ వద్ద “సిల్క్” బ్యాగులను బేరం ఆడటం ప్రారంభిస్తాడు. వ్యాపారి రూ.550 చెబుతాడు. కానీ “నిజాయితీ ధర” చెప్పాలని అడిగినప్పుడు, అతను దానిని రూ.400కి తగ్గిస్తాడు. పర్యాటకుడు వద్దని చెబుతాడు.దాంతో ఆ వ్యాపారి వరుసగా ధరలు తగ్గిస్తూ వచ్చాడు. మొదట రూ.200, తరువాత రూ.150, చివరకు రూ.50కి తగ్గిస్తాడు.
ఇంత తగ్గించడంతో ఆ పర్యాటకుడు “ఇది 550 నుండి 200కి ఎలా చేరుకుంది?” అని అడుగుతాడు. రూ.50 వద్ద కూడా, అతను బ్యాగ్ కొనకూడదని చివరికి నిర్ణయించుకుంటాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ @nativety ద్వారా “భారతదేశంలో $0.25 చిప్స్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. ఈ వీడియో 30 మిలియన్లకు వ్యూస్ వచ్చింది.
పర్యాటకుడి విధానాన్ని చాలా మంది వ్యతిరేకించారు. స్కామ్ ఇన్ ఇండియా అంటూ వీడియో పోస్టు చేయడంపై విమర్శలు గుప్పించారు. అమెరికాలో అదే బ్యాగ్ ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, దానిపై టిప్ కూడా చెల్లిస్తారని పర్యాటకుడిపై ఓ యూజర్ అసం1తృప్తి వ్యక్తం చేశారు. కొనకపోతే, ఎందుకు బేరసారాలు చేస్తూనే ఉన్నారని కొంత మంది ప్రశ్నించారు.