Andhra Pradesh Telangana News Today - పవన్ కల్యాణ్‌ను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ కోరుతోందా ?
తెలుగుదేశం-జనసేన కూటమిగా 100 సీట్ల వరకూ ప్రకటించి అందులో నారా లోకేశ్, చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు వంటి నేతలు ఎక్కడ్నించి పోటీ చేస్తారనేది క్లారిటీ వచ్చింది. జనసేన తరపున నాదెండ్ల మనోహర్ ఎక్కడ్నించి పోటీ చేస్తారో కూడా తేలింది. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడ్నించి పోటీ అనేది ఇంకా సందిగ్దంలోనే ఉంది. దీనికి కారణం బీజేపీ పెద్దలు, జనసేనాని మధ్య జరిగిన అవగాహన అని తెలుస్తోంది. ఈసారి పపవ్ కళ్యాణ్ అటు అసెంబ్లీ ఇటు లోక్‌సభ రెండింట్లో పోటీ చేయవచ్చని సమాచారం. ఎందుకంటే తెలుగుదేశం-జనసేన విజయం సాధిస్తే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం - పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్ర సాయం!
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) 6 గ్యారెంటీల అమల్లో భాగంగా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఈ నెల 11న ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పథకానికి సంబంధించి పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. కేంద్రం అమలు చేస్తోన్న 'అందరికీ ఇళ్లు' పథకం కింద కొంత మేర నిధులు సమీకరించాలని యోచిస్తోంది. కాగా, రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి గతంలోనూ కేంద్రం ఆర్థిక సాయం అందించింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి 2016 -17లో రూ.1,100 కోట్ల మేర సాయం అందింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పోటీ చేసే సీట్లపైనా స్పష్టతకు వచ్చిన కూటమి - ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో అంటే ?
నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ లోకి టీడీపీ చేరిక ప్రకటన ఏ క్షణమైనా రానుంది. రెండు విడతలుగా ఢిల్లీలో జరిగిన చర్చల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. టీడీపీ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో , బీజేపీ ఆరు స్థానాల్లో, జనసేన రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నారు. జనసేన రెండు స్థానాలు కాకినాడ, మచిలీపట్నంగా ఖరారయ్యాయి. రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - పీఆర్సీ ప్రకటన
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 1 నుంచి కొత్త పీఆర్సీతో వేతనాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ నిర్ణయంతో 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుండగా.. ప్రభుత్వ ఖజానాపై రూ.418.11 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నాలుగో సిద్ధం సభకు వైసీపీ భారీ ఏర్పాట్లు
వైసీపీ నిర్వహిస్తున్న నాలుగో సిద్ధం సభకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గడిచిన మూడు సిద్ధం సభలకు భారీగా పార్టీ నాయకులు హాజరయ్యారు. నాలుగో సిద్ధం సభను అంతకుమించి నిర్వహించాలన్న ఉద్ధేశంతో ఉన్న వైసీపీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి గుడిపాడులో నాలుగో సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం సాగుతున్నాయి. ఎన్ని లక్షలు మంది వచ్చినా ఇబ్బందుల్లేకుండా ఉండేలా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ నిర్వహిస్తున్న నాలుగో సిద్ధం సభకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి