Top 500 CC Bike Latest News: పెద్ద బైక్‌ల ప్రపంచంలోకి ప్రవేశించాలనుకునే వారికి, రోజువారీ రైడింగ్‌తో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ను అందించే 500cc మరియు అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల ఐదు గొప్ప మోటార్‌సైకిళ్లు వివరాలు. అత్యధిక సీసీతోపాటు ప్రీమియం రైడింగ్ అనుభూతిని కలిగిస్తోంది. వీటిని వేసుకుని జాంజాం అంటూ లాంగ్ రైడ్లకు వెళ్లడంతో ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది.
1. Kawasaki Ninja 500 (500cc):ఇది స్పోర్ట్స్ బైక్ అయినప్పటికీ, కూర్చునే భంగిమ చాలా సౌకర్యంగా ఉంటుంది. నగరంలో నెమ్మదిగా వెళ్లడానికి సులువుగా ఉన్నా, 8,000rpm తర్వాత ఇంజిన్ పూర్తి శక్తితో సూపర్బ్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ధర ఎక్కువైనా, రైడింగ్ అనుభూతిని కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.
2. Royal Enfield Continental GT 650 (500-650cc):ఈ కేఫ్ రేసర్ బైక్ సులభమైన రైడింగ్‌కు ప్రసిద్ధి. అద్భుతమైన టార్క్ కారణంగా మీరు ఏ గేర్‌లో ఉన్నా వేగం అందుకోవడం సులువు. రెట్రో లుక్ , స్టన్నింగ్ ఇంజిన్ సౌండ్‌తో ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 650cc బైక్‌లలో ఒకటి.
3. Honda XL750 Transalp (650-800cc):పాత-తరహా డిజైన్‌తో కూడిన ఈ అడ్వెంచర్ బైక్, 755cc ఇంజిన్‌తో శక్తివంతమైన పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. దీని అధిక గ్రౌండ్ క్లియరెన్స్ , సస్పెన్షన్ ట్రావెల్ కారణంగా, మన దేశంలోని గతుకుల రోడ్లపైన కూడా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
4. BMW S 1000 XR (900-1000cc):ఈ స్పోర్ట్ టూరర్, అడ్వెంచర్ బైక్ లాగా సౌకర్యంగా ఉంటూనే, రోడ్ బైక్ లాగా హ్యాండిల్ అవుతుంది. దీని శక్తివంతమైన ఇంజిన్ ఏ వేగంలోనైనా సులభంగా క్రూజ్ అయ్యే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఖరీదైనప్పటికీ, BMW ప్రీమియం ఫీల్ , నాణ్యత ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి.
5. Ducati Multistrada V4 (1000cc+):ప్రపంచ పర్యటనకు అనువైన బైక్ ఇది. దీని కొత్త V4 ఇంజిన్ అపారమైన శక్తిని ఇస్తుంది, అదే సమయంలో రైడింగ్‌లో రిక్లైయినర్ లాంటి ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. రాడార్ అసిస్టెడ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో, సుదూర ప్రయాణాలకు ఇది ఉత్తమ ఎంపిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా మంచి ప్రయాణ అనుభూతికి అత్యధిక సీసీ గల బైకులు అనువుగా ఉంటాయి. యూత్ ఈ బైకులపై ఎక్కువ మక్కువ పెంచుకుంటున్నారు. ఎంత ఖర్చైనా సరే వీటిని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో ఖరీదైనప్పటికీ, ఈ బైకుల మార్కెట్ నానాటికీ విస్తరిస్తోంది.