మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 8 పాటు ఆయనను ఈడీ అధికారులు విచారించారు. విదేశీ డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్ధిక లావాదేవీలు, మనీలాండరింగ్‌పై ఈడీ ఆరా తీసినట్లుగా  సమాచారం. నవదీప్‌కు చెందిన ప్రొడక్షన్ హౌస్, వ్యక్తిగత ఖాతాలపైనా వివరాలు సేకరించినట్లుగా సమాచారం. అలాగే ఆయనకు సంబంధించిన 3 బ్యాంక్ ఖాతాలు, నవదీప్ నడిపిన పబ్ వివరాలు, నైజీరియన్లతో సంబంధాలపై ఆరా తీసింది.


ఈ కేసులో దాదాపు 8 గంటలకు పైగా ఇది అధికారులు ఆయనను ప్రశ్నించారు. మత్తు పదార్థాలకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడి అనుమానిస్తోంది. మాదకదవ్య వ్యక్రేతలతో నవదీప్ కు ఉన్న ఆర్థిక సంబంధాలు, బ్యాంకు ఖాతాలో ఆర్థిక లావాదేవీల గురించి అధికారులు ఆయనను ఉదయం 11 గంటల నుంచి ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఆర్థిక లావాదేవీల సంబంధించిన పత్రాలను నవదీప్ అధికారులకు చూపించినట్లు సమాచారం. మరోవైపు నార్కోటిక్ పోలీసులు నవదీప్ ను ఇంకోసారి విచారించేందుకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతా లావాదేవీలు, డ్రగ్స్ విక్రయితలతో ఉన్న ఆర్థిక సంబంధాలపై ఈడి అధికారులు లోతుగా ఆరా తీశారు. 


మాదాపూర్ మాదకద్రవ్యాల కేసు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి వారి నుంచి వివరాలను సేకరిస్తున్నారు. విచారణ సందర్భంగా నిందితులు చెబుతున్న విషయాలు.. ఆయా వ్యక్తుల ఫోన్ డేటా సాయంతో మరి కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పలువురు నిందితుల కాల్ లిస్టులో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై నిగాపెట్టారు. ఇందులో భాగంగా నార్కోటిక్ పోలీసులు ఇదివరకే నటుడు నవదీప్ ను విచారించారు. తాజాగా ఈ వ్యవహారంపై ఈడి రంగ ప్రవేశం చేసింది. ఈ మేరకు ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ ఈనెల 7వ తేదీన నవదీప్ కు నోటీసులు జారీ చేసింది. ఈడి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొంది. 


ఈ కేసులో నార్కోటికి పోలీసులు నవదీప్ ను ఇటీవల విచారించిన సంగతి తెలిసిందే. ఆయన ఫోను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ లిస్ట్ ముందు ఉంచి సుమారు 6 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. నవదీప్ నుంచి పలు కీలక సమాచారం రాబట్టారు. వాట్సప్ చాటింగ్ ను రిట్రివ్ చేసి, డేటా అందిన తర్వాత మరోసారి నవదీప్ ను విచారించే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. 


నార్కోటిక్ పోలీసుల విచారణ ముగించుకొని బయటకు వచ్చిన నటుడు నవదీప్ మీడియాతో మాట్లాడారు. తను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు అని తెలిపారు. వైజాగ్ కు చెందిన రాంచందర్ తో తనకు పరిచయం మాత్రమే ఉందని, అతనితో ఎలాంటి డ్రెస్ డీలింగ్ చేయలేదని తెలిపారు. తనకు నోటీసులు ఇచ్చినందుకు పోలీసుల ఎదుట విచారణకు హాజరైనట్లు చెప్పారు. గతంలో తాను ఓ పబ్ నిర్వహించానని, ఆ విషయంలో పలు వివరాలు తీసుకున్నారని స్పష్టం చేశారు. అధికారులు అడిగిన అన్ని వివరాలు ఇచ్చానని అవసరం అనుకుంటే మళ్లీ పిలుస్తామన్నారని చెప్పారు. 


ఈ ఏడాది  సెప్టెంబర్ 14న గుడి మల్కాపూర్ పోలీసులతో కలిసి నార్కోటిక్ బ్యూరో అధికారులు ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుని తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వారి విచారణలో భాగంగా నవదీప్ తో సంప్రదింపులు జరిపినట్లు తేలడంతో అతడిని నిందితునిగా చేర్చారు.