Breaking News Telugu Live Updates: కేసీఆర్‌తో ముగిసిన ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 12 Jun 2022 09:14 PM
Background
తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ ప్రస్తుతం తగ్గింది. శుక్రవారం, శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్ వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 40 గంటల...More
తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ ప్రస్తుతం తగ్గింది. శుక్రవారం, శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్ వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 40 గంటల సమయం పట్టింది. ఆదివారం నాడు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు దాదాపు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో వికేండ్ లో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా భక్తుల కోసం వారపు ఆర్జిత సేవలను సైతం రద్దు చేయాలని ఈవో ధర్మారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు, కొంకణ్‌లోని పలు ప్రాంతాలకు, ముంబై, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు శనివారం ప్రవేశించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ ఉపరితల ఆవర్తనం, పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రుతుపవనాల గమనం మందగించడంతో తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా ప్రవేశిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఏపీలోని రాయలసీమలోకి ప్రవేశించాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. కానీ అమరావతి వాతావరణ కేంద్రం మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. రానున్న 48 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్ లోని మిగిలిన ప్రాంతాల్లోకి, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య, వాయువ్యవ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఆంధ్రప్రదేవ్ తీరం వద్ద సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు ఏపీ, తెలంగాణ సహా బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, ఉపహిమాలయాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, గంగా టిక్ పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బిహార్ లోని కొన్ని ప్రాంతాలలోకి తదుపరి రెండు నుంచి మూడు రోజులలో రుతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి.తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి (55) అదృశ్యం కావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా తన భర్త వెంకటాచారి కనిపించడం లేదంటూ ఆయన భార్య కాసోజు శంకరమ్మ హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆయన అదృశ్యమైన పది రోజుల తరువాత శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 1వ తేదీన ఓ పని మీద వెంకటాచారి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదని, ఆయనను చూడలేదని.. తన భర్త జాడ కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదులో శంకరమ్మ పేర్కొన్నారు.తన భర్త వెంకటాచారి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వద్ద ఉండొచ్చునని శంకరమ్మ అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటాచారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్లు కేఏ పాల్ ప్రకటించడం తెలిసిందే. కేఏ పాల్ ఆహ్వానం మేరకు వెంకటాచారి ప్రజా శాంతి పార్టీలో చేరారు.బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. నిన్న దిగొచ్చిన బంగారం ధరలు నేడు పెరిగాయి. మరోవైపు వెండి ధర నిలకడగా ఉంది. రూ.650 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750కి పుంజుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,350 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,000 అయింది.