Pakistan earthquakes:  పాకిస్తాన్ లో వరుసగా భూకంపాలు వస్తున్నాయి. గత మూడు రోజుల్లో మూడు భూకంపాలు వచ్చినట్లుగా రికార్డు అయింది. అియితే అన్నింటి తీవ్ర ఐదు లోపే ఉన్నాయి. దీంతో ప్రమాదం గురించి పెద్దగా బయటకు రాలేదు. కానీ ఎప్పుడూ లేనిది ఇలా వరుసగా ఇప్పుడే భూకంపాలు రావడంపై మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కిరానా హిల్స్ లో పాకిస్తాన్ అణుస్థావరంపై భారత్ దాడి చేయడం వల్ల అవి నాశనం అయ్యాయనని.. ఈ కారణంగానే భూకంపాలు వస్తున్నాయన్న అనుమానాన్ని కొంత మంది నిపుణులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. 

బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్,   పంజాబ్, సింధ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ వంటి ప్రాంతాల్లో   భూకంపాల వచ్చాయి.  గత 30 రోజులలో, పాకిస్తాన్‌లో 2.0 మాగ్నిట్యూడ్‌కు పైగా 25 భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక తీవ్రత 5.7 మాగ్నిట్యూడ్‌తో ఏప్రిల్ 19, 2025న ఆఫ్ఘనిస్తాన్‌లోని అష్కాషమ్ సమీపంలో సంభవించింది.  

 2005లో సంభవించిన 7.6 మాగ్నిట్యూడ్ భూకంపం 74,000 మంది మరణాలకు కారణమైంది, ఇది   అత్యంత వినాశకరమైన భూకంపాలలో ఒకటి. 1945లో 8.1 మాగ్నిట్యూడ్ భూకంపం తుర్బత్ సమీపంలో సంభవించింది, ఇది 1900 నుండి అత్యంత తీవ్రమైనది. తాజా భూకంపం  తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లోని భూకంప ప్రమాదం ఎప్పటికీ ఉంటుంది. లోతులేని భూకంపాలు తరచూ ఆఫ్టర్‌షాక్‌లకు దారితీస్తాయి.    పాకిస్తాన్ లో భూప్రకంపనలు సహజమే అయినా ఇప్పుడు వస్తున్న ప్రకంపనలు మాత్రం తేడాగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

వరుసగా వస్తున్న భూకంపాలు సహజమైనవి కావని.. పాకిస్తాన్ అణు టెస్టులు అయినా నిర్వరిస్తూ ఉండాలి లేకపోతే.. పాత ఆయుధాలు ధ్వంసం అయినా అయి ఉండాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.  

 అణ్వాయుధాలు ధ్వంసం అయ్యాయన్న్ ప్రచారం ..  వరుసగా వస్తున్న భూకంపాలకు ఈ అణు ఆయుధాలే కారణం అని జరుగుతున్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్నా.. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇకా ఎలాంటి ప్రకటన చేయలేదు.