16 Psyche: అంతరిక్షంలో మిస్టరీ- ఈ గ్రహశకలం భూమిపై ఉన్న ప్రతి వ్యక్తిని బిలియనీర్‌గా చేస్తుందట

16 Psyche : 16 సైకి అనే గ్రహశకలం బంగారం, ప్లాటినం, నికెల్, ఇనుము సహా విలువైన ఖనిజాలతో ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిపై వనరులను పంచితే భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ బిలియనీర్ అవుతారని అంటున్నారు.

Continues below advertisement

16 Psyche : అంతరిక్షం.. అనేక రహస్యాలకు నిలయం. శాస్త్రవేత్తలు వాటిలో కొన్నింటిని కనుగొన్నప్పటికీ, చాలా వాటిని ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. వీటిలో ఒకటి గ్రహశకలాలు. లక్షలాది గ్రహశకలాలు విశ్వంలో తేలుతున్నాయి. మన సౌర వ్యవస్థ మూలాలను అర్థం చేసుకోవడానికి ఈ గ్రహశకలాలు కీలకమని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. దీనిపై ఈనాటికీ పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే, వివిధ ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న ఒక నిర్దిష్ట గ్రహశకలం గురించి ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ గ్రహశకలం పేరు 16 సైకి. మానవాళి ఈ గ్రహశకలంపై అడుగెడితే భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి బిలియనీర్ అవుతాడని అంటున్నారు.

Continues below advertisement

ఈ గ్రహశకలం ప్రత్యేకత ఏమిటి?

పలు అధ్యయనాలు ఇచ్చిన సమాచారం ప్రకారం, 16 సైకి గ్రహశకలాన్ని 1852లో ఇటాలియన్ శాస్త్రవేత్త అన్నీబేల్ డి గ్యాస్పరిస్ కనుగొన్నాడు. ఇది మార్స్, బృహస్పతి కక్ష్యల మధ్య ఉంటుంది. ఈ గ్రహశకలం బంగారం, ప్లాటినం, నికెల్, ఇనుముతో సహా విలువైన ఖనిజాలతో సమృద్ధిగా ఉందని, 226 కిలోమీటర్ల చుట్టుకొలతను కలిగి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని విలువ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనాలు సూచిస్తున్నాయి. గ్రహశకలం వనరులను భూమిపైన ఉన్న జనాభాకు సమానంగా పంచితే ప్రతి వ్యక్తీ బిలియనీర్ అవుతాడని చెబుతున్నారు.

Also Read : Best Mobiles Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!

దీని విలువ ఎంత?

వివిధ రకాల ఖనిజాలతో నిండిన 16 సైకి అంచనా వేసిన విలువ సుమారు 10వేల క్వాడ్రిలియన్ డాలర్లు. అంటే దాదాపు 100 మిలియన్ బిలియన్ డాలర్లు. ఈ ధర చాలా ఎక్కువ. దీన్ని భారతీయ రూపాయలలో లెక్కించడం దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. ఈ గ్రహశకలం సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది భూమి కంటే సూర్యుని నుండి మూడు రెట్లు దూరంలో ఉందని సమాచారం.

భూమిని ఢీకొంటే?

శాస్త్రవేత్తల ప్రకారం, 16 సైకి పరిమాణం చాలా పెద్దది. ఇది గనక భూమిని ఢీకొంటే, అది భారీ విపత్తు నష్టాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి, ఇది భూమిలో కొంత భాగాన్ని పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం ఉంది. 2023లో ఈ గ్రహశకలంపై పరిశోధన చేసేందుకు నాసా ఒక మిషన్‌ను ప్రారంభించింది. అయితే, ఈ ఉల్కపై ఎప్పుడైనా మైనింగ్ ప్లాన్ చేస్తే, అది చాలా ఖరీదైన ప్రయత్నం అవుతుందని భావిస్తున్నారు.

నాసా తన సైక్ అంతరిక్ష నౌకను అక్టోబర్ 2023లో పంపింది. ఈ గ్రహశకలం భూమికి దాదాపు 3.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల, అంతరిక్ష నౌక ఆగష్టు 2029 నాటికి అక్కడికి చేరుకుంటుంది. ఆపై గ్రహశకలం అన్వేషించడం ప్రారంభిస్తుంది. కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత, అంతరిక్ష నౌక సైకిని మ్యాప్ చేసి అధ్యయనం చేస్తుంది. ఇది చిత్రాలను తీయడానికి, ఉపరితలాన్ని మ్యాప్ చేయడానికి, కూర్పును గుర్తించడానికి డేటాను సేకరించడానికి ఉల్క చుట్టూ తిరుగుతూ సుమారు రెండు సంవత్సరాలు గడుపుతుంది. 

Also Read : Bangladesh: మరో పాకిస్తాన్‌గా మారుతున్న బంగ్లాదేశ్ - హిందువులపై అంతకంతకూ పెరుగుతున్న దాడులు

Continues below advertisement