Bearish Stocks: ఇవాళ (మంగళవారం) స్టాక్‌ మార్కెట్‌ మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌తో స్టార్టయింది. BSE సెన్సెక్స్‌ 18 పాయింట్ల నష్టంతో 61,126 దగ్గర, NSE నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 18179 దగ్గర ప్రారంభమయ్యాయి.


స్టాక్‌డ్జ్.కామ్ (stockedge.com) టెక్నికల్ స్కాన్ డేటా ప్రకారం, NSE లిస్టెడ్‌ స్టాక్స్‌లో రూ. 1,000 కోట్లకు పైగా మార్కెట్ విలువ (మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌) ఉన్న ఐదు కంపెనీల స్క్రిప్స్‌ డెత్ క్రాస్‌ ఓవర్‌లో ఉన్నాయి. ఇది బేరిష్‌ సిగ్నల్‌. ఈ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగుతాయన్నదానికి ఇది సాంకేతిక సూచన.


డెత్ క్రాస్ అంటే..?
ఒక స్టాక్‌ టెక్నికల్‌ చార్ట్‌లో.. దీర్ఘకాలిక సింపుల్‌ మూవింగ్ యావరేజ్‌ను (SMA) క్రాస్‌ చేసి, దాని దిగువకు స్వల్పకాలిక సింపుల్ మూవింగ్ యావరేజ్ చేరడాన్ని డెత్ క్రాస్‌ అని పిలుస్తారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే... ఒక స్టాక్‌ 200 డేస్‌ SMA లైన్‌ను 50 డేస్‌ SMA లైన్‌ క్రాస్‌ డౌన్‌ చేసి కిందకు వెళ్లడాన్ని డెత్ క్రాస్‌గా పిలుస్తారు. ఈ కింద చెప్పిన 5 స్టాక్స్‌, సోమవారం (నవంబర్ 21, 2022) నాటి ట్రేడింగ్‌లో డెత్‌ క్రాస్‌ చేశాయి. వీటిలో బేరిష్‌నెస్‌కు ఇది సిగ్నల్‌ అని, ఇకపై సెల్లింగ్‌ ఉండవచ్చని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.


గుజరాత్‌ నర్మద వ్యాలీ ఫెర్టిలైజర్స్‌ & కెమికల్స్ (Gujarat Narmada VFC)
సోమవారం నాటి ముగింపు ధర: రూ. 576.1
50 రోజుల SMA: రూ. 680.05
200 రోజుల SMA: రూ. 683.09


భారత్‌ ఎర్త్‌మూవర్స్‌ లిమిటెడ్‌ (BEML)
సోమవారం నాటి ముగింపు ధర: రూ. 1488.5
50 రోజుల SMA: రూ. 1533.43
200 రోజుల SMA: రూ. 1536.14


ది ఒరిస్సా మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ (Orissa Minerals)
సోమవారం నాటి ముగింపు ధర: రూ. 2650.9
50 రోజుల SMA: రూ. 2802.95
200 రోజుల SMA: రూ. 2806.86


అహ్లూవాలియా కాంట్రాక్స్‌ ఇండియా (Ahluwalla Contracts)
సోమవారం నాటి ముగింపు ధర: రూ. 443.45
50 రోజుల SMA: రూ. 434.54
200 రోజుల SMA: రూ. 434.83


స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌ ‍(Steel Strip)
సోమవారం నాటి ముగింపు ధర: రూ. 158.05
50 రోజుల SMA: రూ. 160.99
200 రోజుల SMA: రూ. 161.07


Aadhaar Card Photo Update: ఆధార్ కార్డ్‌లో ఫోటో నచ్చలేదా? అందంగా మార్చుకోండిలా!


 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.