Stars of Science: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా  మన దేశాన్ని ప్రపంచంలోనే ప్రముఖంగా  నిలబెట్టిన పరిశోధకలు.. శాస్త్రవేత్తలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి గురించి కొత్త తరానికి తెలిసింది కొంచెం తక్కువే.  వారి పరిశోధనల వల్ల ప్రపంచం గతే మారిపోయింది. దేశానికి ఎంతో మేలు జరిగింది. అలాంటి వారి గురించి  పూర్తిగా తెలుసుకోవడం మన విధి. 


శ్రీనివాస రామానుజన్ ! 


20 వ శతాబ్దపు అత్యుత్తమ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్.  స్వతంత్రంగా గాస్, కుమ్మేర్ మరియు హైపర్ రేఖాగణిత సిరీస్ లను శ్రీనివాస రామానుజన్ కనుగొన్నారు.  సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేశారు. భిన్నాలు , అపరిమిత సిరీస్ లను ప్రపంచానికి పరిచయం చేశారు.  రామానుజన్‌ π విలువను 3.14159265262= (9²+19²/22)¼గా చెప్పారు. గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్‌ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 26 ఏప్రిల్‌ 1920న చనిపోయారు. కానీ ఆయన ఎప్పటికీ ప్రపంచం మెచ్చిన గణిత శాస్త్రవేత్తల్లో ఒకరిగా ఉంటారు. 



A.P.J. అబ్దుల్ కలాం !


భారత మిసైల్ మ్యాన్‌గాపేరు తెచ్చుకున్న ఏపీజే అబ్దుల్ కలాం గురించి తెలియని వారు మన జనరేషన్‌లో కూడా ఉండరు.  శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన కలాం.. తర్వాత అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు. అగ్ని, పృథ్వీ వంటి ఎన్నో మిస్సైల్స్ ఆయన ఆధ్వర్యంలోనే నింగిలోకి దూసుకెళ్లాయి. బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధికి ఏర్పాటైన ప్రాజెక్ట్ డెవిల్ అండ్ ప్రాజెక్ట్ వాలియెంట్ (VALIAN)కు కలాం డైరెక్టర్‌గా పనిచేశారు. జులై 1992 నుంచి డిసెంబర్ 1999 వరకు ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ముఖ్యకార్యదర్శిగానూ సేవలందించారు. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించారు. భారత 11వ రాష్ట్రపతిగా పనిచేసిన కలాం.. ‘పీపుల్స్ ప్రెసిడెంట్’గా ఖ్యాతి గడించారు. భారతరత్నమయ్యారు. 
 
మోక్షగుండం విశ్వేశ్వరయ్య 


కర్నాటక చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య,మైసూర్ లో కావేరి నదిపై కృష్ణ రాజ సాగర్ ఆనకట్టను నిర్మించిన ఒక ఇంజనీరు. ఆయన గౌరవార్ధం, భారతదేశం ప్రతి సంవత్సరం అయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 న ఇంజినీర్స్ డే గా జరుపుకుంటున్నారు. ఆయన ప్రజా మరియు ఆధునిక నిర్మాణ భారతదేశం గురించి చేసిన వివిధ రచనలకు 1955 వ సంవత్సరంలో భారతరత్న అవార్డు లభించింది.



C. V. రామన్


 భారతదేశంలో చంద్రశేఖర వెంకట రామన్ అత్యంత ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరుగా ఉన్నారు. భౌతిక శాస్త్రంలో అయన ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ అని పిలిచే కాంతి పరిక్షేప ప్రభావంను కనుగొన్నారు. ఒక పారదర్శక పదార్థం గుండా కాంతి ప్రసరించినప్పుడు కాంతి తరంగదైర్ఘ్యం లో మార్పులు ఉంటాయని అయన నిరూపించారు. కాంతి పరిక్షేప ప్రభావంను కనుకొన్న రామన్ కు 1930 వ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. 



హోమీ జహంగీర్ భాభా హోమీ భాభా


భాభా అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే కు వ్యవస్థాపక డైరెక్టర్‌ హోమీ భాభా.  అతని గౌరవార్థం ఆ సంస్థకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టారు. భారత అభివృద్ధికి మూలస్తంభాలుగా ఉన్న TIFR, AEET అణ్వాయుధాల సంస్థలకు అతను డైరెక్టర్‌గా పర్యవేక్షించాడు. అతనికి ఆడమ్స్ ప్రైజ్ (1942), పద్మభూషణ (1954) పురస్కారాలు లభించాయి. 1951, 1953–1956లలో అతను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడ్డాడు అయన భారతీయ అణు శక్తి చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఉన్నారు.  


 
జగదీష్ చంద్ర బోస్


 బెంగాలీ భౌతిక శాస్త్రవేత్త,జీవశాస్త్రజ్ఞుడు,వృక్షశాస్త్రజ్ఞుడు మరియు పురాతత్వవేత్త అయిన JC బోస్ రేడియో , మైక్రోవేవ్ ఆప్టిక్స్ రంగంలో వివిధ అధ్యయనాలను కనుగొన్నారు. అయన జంతువులు మరియు మొక్కలు వివిధ పరిస్థితుల్లో ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి 'క్రెస్కోగ్రాఫ్' అనే పరికరాన్ని కనుగొన్నారు.  జగదీష్ చంద్ర బోస్ వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించాడు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది బోసే.   తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశంతో బహిర్గతం చేశారు. 


మరెంతో మంది చరిత్ర గతిని మార్చిన శాస్త్రవేత్తలు  భారతీయులే. వారందరూ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా.. వారందర్నీ " స్టార్స్ ఆఫ్ సైన్స్‌"గా మనం గుర్తు చేసుకోవడం కనీస బాధ్యత.