Pain of a husband with a beautiful wife : కాకి ముక్కుకు దొండ పండు అనే సామెతను మనం చాలా సార్లు విని ఉంటాం. ఈ సామెతకు కారణం ఓ మాదిరిగా ఉండే యువకుడికి.. అప్సరస లాంటి భార్య దొరకడం. అతడు కాకి అయితే ఆమె దొండ పండు అని అర్థం. 

ఇలాంటి భర్తల పరిస్థితి ఘోరంగా ఉంటుంది.మానసికంగా వీక్ గా ఉంటే తట్టుకోవడం కష్టం. ఈ భర్త అలాంటివాడే.  ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక వ్యక్తి, తన భార్య అందం గురించి బంధువులు ఎగతాళి చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యక్తి తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.   స్థానికులు,  పోలీసులు సకాలంలో జోక్యం చేసుకొని అతనిని రక్షించారు.  

  బరేలీలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి  కి ఇటీవల పెళ్లి అయింది. ఆమె అందంగా ఉంటుంది. అతను ఓ మాదిరిగా ఉంటాడు. దీంతో  , తన భార్య అందం గురించి బంధువులు "ఇంత అందమైన భార్యను నీవు ఎలా సంపాదించావు?" అని  కనిపించిన ప్రతీసారి ప్రశ్నించడం ప్రారంభించారు. రానురాను అది ఎగతాళిగా మారడంతో  మానసికంగా కుంగిపోయాడు. అతను తన ఇంటి టెర్రస్‌పైకి చేరుకొని దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. 

 ఈ సంఘటన యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, ఆ వ్యక్తి టెర్రస్ అంచున నిలబడి ఉన్నాడు, స్థానికులు మరియు పోలీసులు అతనిని దిగువ నుంచి ఒప్పించే ప్రయత్నం చేశారు.   ఆ వ్యక్తిని టెర్రస్ నుంచి సురక్షితంగా దిగేలా ఒప్పించారు. పోలీసులు కేసులు నమోదు చేయలేదుకానీ..  ఆ వ్యక్తి భార్యను కామెంట్ చేయవద్దని గ్రామస్తులను హెచ్చరించారు.  

అందుకే పెద్దలు అంటారేమో.. గంతకు తగ్గ బొంతను చేసుకోవాలని.