Thai Influencer Dies After Guzzling Whisky Bottles In Deadly Rs 75,000 Challenge: నేను ఐదు బీర్లు తాగుతా.. పది బీర్లు తాగుతా అని పందెం కట్టుకునేవాళ్లు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్లకు అదో గొప్ప. ఎందుకు గొప్పో ఎవరికీ తెలియదు. ఇలాంటి వాళ్లు మన దగ్గర మాత్రమే కాదు చాలా చోట్ల .. ఇదర దేశాల్లో కూడా ఉంటారు. ఇలా అడ్డగోలుగా తాగేస్తానని పందేలు వేసుకుంటూ వీడియోలు తీసుకునే వ్యక్తి అదే పని చేస్తూ చచ్చిపోయాడు. ఈ ఘటన ధాయ్ ల్యాండ్ లో జరిగింది.
ఆన్ లైన్ లో "బ్యాంక్ లీసెస్టర్"గా ప్రసిద్ధి చెందిన థానాకర్న్ కాంత్ అనే వ్యక్తి హ్యాండ్ శానిటైజర్, వాసాబీ తాగడం వంటి బెట్టింగ్‌లకు పాల్పడేవాడు. వాటిని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పెట్టుకునేవాడు. అలా బర్త్ డే పార్టీలో ఓ వ్యక్తి బ్యాంక్ లీసెస్టర్ ను సవాల్ చేశాడు. రెండు విస్కీ బాటిళ్లు దింపకుండా తాగాలని సవాల్ చేశాడు. 30,000 థాయ్ బాత్ లను బెటటింగ్ గా పెట్టాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న లీసెస్టర్ ఛాలెంజ్ ను స్వీకరించి 20 నిమిషాల్లో రెండు బాటిళ్లు తాగాడు. అయితే మద్యం మత్తులో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. చనిపోయాడు. ఈ బెట్టింగ్ వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని ఇంటి నుంచి పిస్టల్, బ్యాంక్ పాస్ బుక్ లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుట్రపూరితంగా అతనితో విస్కీ తాగించారని పోలీసులు అనుమానిస్తున్నారు.