Elon Musk: టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కి గూగుల్ కోఫౌండర్ భార్యకి అఫైర్ ఉందంటూ ఓ రిపోర్ట్ సంచలన విషయం చెప్పింది. గూగుల్ కోఫౌండర్ సెర్గే బ్రిన్ భార్య నికోలే షానహాన్‌తో (Nicole Shanahan) అఫైర్ నడిపించాడని వెల్లడించింది. 2021లో ఓ పార్టీలో వీళ్లిద్దరూ కలిసే ఉన్నారని, ఆ టైమ్‌లో కలిసే డ్రగ్స్ కూడా తీసుకున్నారని తేల్చి చెప్పింది. The New York Times ఈ విషయం తెలిపింది. రకరకాల సోర్సెస్ నుంచి సమాచారం సేకరించిన తరవాతే కన్‌ఫమ్ చేసుకున్నట్టు వివరించింది. సెర్గే బ్రిన్, మస్క్ ఇద్దరూ ఫ్రెండ్స్. 2021లో రిపబ్లిక్ పార్టీ నుంచి Robert F. Kennedy Jr స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. కెనెడీతో పాటు షానహాన్ కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలోనే ఓ పార్టీ జరిగింది. ఆ పార్టీని షానహాన్ హోస్ట్ చేశారు. ఈ పార్టీకి మస్క్ కూడా వెళ్లాడు. అప్పుడే ఇద్దరికీ పరిచయమైంది. ఈ పార్టీల ఇద్దరూ కలిసి ketamine తీసుకున్నారని రిపోర్ట్ వెల్లడించింది.
ఆ తరవాత మస్క్ సోదరుడు మియామీ ఇచ్చిన పార్టీలోనూ ఇద్దరూ మరోసారి కలిశారు. ఆ సమయంలోనూ ఇద్దరూ కొద్ది గంటల పాటు అక్కడ కనిపించకుండా పోయారు. అంతే కాదు. ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారని కూడా షాహనాన్ అంగీకరించినట్టు సన్నిహితులు చెప్పినట్టు ఈ రిపోర్ట్‌లో ప్రస్తావన ఉంది. అయితే...ఈ విషయం బయటకు వచ్చాక మాత్రం మస్క్, షాహనాన్ అదేమీ లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తల్ని కొట్టిపారేశారు. తన కూతురు ఆటిజంతో బాధ పడుతోందని, దాని గురించే ఇద్దరం మాట్లాడుకున్నామని చెప్పారు. అనవసరంగా తమపై ఇలాంటి బురదజల్లొద్దని కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు షాహనాన్. అయితే...ఈ పార్టీ తరవాతే షాహనాన్ భర్త బ్రిన్ విడాకులకు అప్లై చేశాడు. దాదాపు 18 నెలల తరవాత ఇద్దరూ విడిపోయారు. గతేడాది డైవర్స్ అయినట్టు ప్రకటించారు.
Also Read: Madhya Pradesh: వాయిస్ మార్చే యాప్‌తో బాలికలకు వల, స్కాలర్‌షిప్ ఇస్తానని పిలిపించి అత్యాచారం