భారీగా పోస్టల్ బ్యాలెట్‌ ఓటు ఎవరికి చేటు? లెక్కలతో పెరిగిపోతున్న నేతల బీపీ!
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల్లో చాలా ఆసక్తికరమైన కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పోస్టల్‌ బ్యాలెట్‌లు రావడం అశ్చర్యపరిచింది. గతానికి కంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికారులకు చేరాయి. అయితే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అందులో ఎన్ని వ్యాలీడ్ అవుతాయో ఎన్ని చెల్లకుండా పోతాయో అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఉద్యోగాలిచ్చింది కేసీఆర్ - రేవంత్ చేసింది అదే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.   32 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని రేవంత్ చెప్పుకుంటున్నారని అవన్నీ కేసీఆర్ సర్కార్ భర్తీ చేసినవేనని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెబుతున్న  32 వేల ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన వివ‌రాల‌ను కేటీఆర్ వెల్లడించారు.  ఈ ఉద్యోగాల‌కు రేవంత్ కేవ‌లం నియామ‌క ప‌త్రాలు మాత్ర‌మే అంద‌జేసిన‌ట్లు కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీలో మాఫియారాజ్ - ఎలుకలు పిల్లిని తరుముతాయి - రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సెటైర్
మాచర్లలో భయానక వాతావరణం సృష్టించి,ఈవీఎంలను కూడా ధ్వంసం చేసి వీడియోకు చిక్కిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వ్యవస్థలు అరెస్టులు చేయలేకపోవడంపై రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సోషల్  మీడియాలో సెటైర్లు వేశారు.  మాచర్ల ఎపిసోడ్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలుకలు పిల్లిని వెంబడించిన కేసుగా పిన్నెల్లి వ్యవహారాన్ని పీవీ రమేష్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు, రెవిన్యూ అదికారులు  ఎల్ల వేళలా ఎమ్మెల్యేల సర్వీసులో ఉంటారన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఇప్పట్లో బయటకు రానట్టేనా ? ఆ కేసులు వెంటాడుతున్నాయా?
ఈవీఎం ధ్వంసం చేసి, ఓటర్లను బెదిరించి కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈవీఎంను విరగొట్టిన కేసులో హైకోర్టులో ఊరట లభించిన ఇంకా ఆయన బయటకు రాలేదు. ఎన్నికల్లో ఏజెంట్లను నియమించుకోవడంతోపాటు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు హైకోర్టులో ఊరట పొందారు. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మాచర్ల వెళ్లొద్దని హైకోర్టు నిన్న రాత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నర్సరావుపేటలోనే ఉండాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణలో సోషల్ మీడియా కేసుల రగడ - ఫేక్ ప్రచారంతోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచగలరా ?
తెలంగాణ రాజకీయాలు జోరు తగ్గట్లేదు. ఫీల్డ్ లో కన్నా ఆన్  లైన్లోనే అసలు రాజకీయం నడుస్తోంది.పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో లీడర్లు అంతా రిలాక్స్ అయ్యారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలపై వరుసగా కేసులు నమోదుతున్నాయి. పేక్ ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేయడం ,కేసులు పెట్టడం కామన్ గా మారిపోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి