Terrorists killed Hindu tourists: కశ్మీర్‌లోని పహల్‌గాంలో జరిగిన దాడిలో హిందువులను గుర్తించి మరీ కాల్చి చంపారు టెర్రరిస్టులు. అయితే చనిపోయిన వారిలో ఓ ముస్లిం ఉన్నాడు. అతని పేరు సయీద్ హుసేన్ షా.
హిందువుల్ని మాత్రమే టెర్రరిస్టుల్ని చంపినప్పుడు ఈ ముస్లింను ఎందుకు చంపారన్నది చాలా మందికి వస్తున్న సందేహం. సయీద్ హుసేన్ షా ముస్లిమే కానీ.. టెర్రరిస్టులకు సపోర్టుగా లేడు. వారికి మద్దతు ఇవ్వలేదు. కాల్పులు జరిపుతున్న సమయంలో అడ్డుకున్నాడు. వారి వద్ద తుపాకిని లాక్కునే ప్రయత్నం చేశాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. దాంతో నిర్దాక్షిణ్యంగా ముస్లిం అని కూడా చూడకుండా చంపేశారు.
సయీద్ హుసేన్ షా టూరిస్టు కాదు. హార్స్ రైడర్. టూరిస్టుల మీదనే ఆధారపడి బతికే అనేక కుటుంబాలల్లో సయీద్ హుసేన్ షా కుటుంబం కూడా ఒకటి. వాహనాలు వెళ్లని పర్యాటక ప్రాంతాలకు గుర్రాల మీద తీసుకెళ్లి ఉపాధి పొందుతూంటాడు. ఇలా దాడి జరిగిన జరిగిన రోజున కూడా సయీద్ హుసేన్ షా పర్యాటకుల్ని తీసుకెళ్లాడు. ఉగ్రవాదులు దాడి చేయడానికి వచ్చారని తెలుసుకుని వారితో వాగ్వాదానికి దిగాడు. కశ్మీర్ పర్యాటకులు అతిథులని వారిని ఏమీ చేయవద్దని వాగ్వాదానికి దిగాడు.
టూరిస్టులను రక్షించే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనపై హుస్సేన్ షా కుటుంబం కన్నీటిపర్యంతం అయ్యింది. గుర్రం తోలుతూ ఇంటిని పోషించే తన కొడుకును ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని అతని తల్లి రోదించింది.
పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపు.. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు కాశ్మీరీలుగా అనుమానం.. 2018లో కాశ్మీర్ను వదిలి పాక్కు వెళ్లిపోయిన అదిల్ గురి, అషన్.. ఇటీవలే మరో నలుగురిని కలిసి మళ్లీ కాశ్మీర్లోకి చొరబడ్డ అదిల్, అషన్.. పాక్ మద్దతుదారుల నుంచి వారికి ఏకే-47 ఆయుధాలు, మందుగుండు సామాగ్రి.. అదిల్ గురి, అషన్ల గురించి సమాచారం సేకరిస్తున్నాయి భద్రతా బలగాలు. అనుమానిత ఉగ్రవాదుల ఫొటోతో పాటు వారి స్కెచ్‌లను విడుదల చేసిన భద్రతా సంస్థలు.. వారి కోసం వేట సాగిస్తున్నాయి. ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. ప్రధాన సూత్రధారి ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా కసూరిగా నిఘా సంస్థల వెల్లడించాయి.