Andhra Pradesh News Today | ఈవీఎంలు వద్దు పేపర్ బ్యాలెట్లు ముద్దన్న జగన్- పాత వీడియోలు చూపిస్తూ నిలదీస్తున్న నెటిజన్లు - ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్ బ్యాలెట్లు వాడాలంటూ ట్వీట్ చేశారు. "న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో EVMలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మనం కూడా అదే దిశగా పయనించాలి." అని జగన్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు - 2 స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ - టీడీపీ ఖాతాలోకే !
ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జులై 3న ఆ నామినేషన్లను పరిశీలిస్తారు. 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంటుంది. 12న పోలింగ్ అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య ఎన్నికలకు కొన్ని రోజుల ముందు టీడీపీలో చేరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పవన్‌కు Y ప్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కారు- డిప్యూటీ సీఎం భద్రత పెంచిన ప్రభుత్వం
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భద్రతను ప్రభుత్వం పెంచింది. వై ప్లస్ సెక్యూరిటీతోపాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును సమకూర్చింది. పవన్ కల్యాణ్ బుధవారం గ్రామీణ, పంచాయతీ, అటవీ, సైన్స్ టెక్నలజీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందే పవన్ కల్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు. తన ఛాంబర్ వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐటీ కంపెనీ- సిట్ మెరుపు సోదాలు- హార్డ్ డిస్క్‌లు, సర్వర్‌లు స్వాధీనం
తెలంగాణలో కొన్ని రోజుల నుంచి రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు ఇందులో ఓ ఐటీ కంపెనీ కూడా భాగం ఉందనే అనుమానం కలుగుతోంది. తాజాగా ఆ సంస్థలో సోదాలు చేయడం కూడా సంచలనంగా మారుతోంది. ఫోన్ టాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. SIBకి టెక్నికల్ సపోర్టు అందిస్తున్న ఇన్నోవేషన్ ల్యాబ్‌లో సిట్ అధికారులు సోదాలు చేశారు. కీలకమైన డాక్యుమెంట్స్, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ సిబ్బంది- సీఎం, ఎండీ ప్రశంసంలు
14 ఏళ్ల బాలికను కాపాడారు, గర్భిణీకి డెలవరీ చేశారు. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుతున్న తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది ప్రశంసలు అందుకుంటోంది.
సమయస్ఫూర్తి ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడేలా చేస్తుంది. ఇలాంటి సమయ స్ఫూర్తితోనే రెండు రోజుల్లో రెండు నిండు ప్రాణాలు కాపాడారు ఆర్టీసీ సిబ్బంది. అందుకే ఆర్టీసీ సిబ్బంది మానవత్వానికి, సమయస్ఫూర్తిని సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి