Elections will be held for two MLC seats in AP :   ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం  షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్  విడుదల చేస్తారు.  జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జులై 3న ఆ నామినేషన్లను పరిశీలిస్తారు. 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంటుంది.  12న పోలింగ్ అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.  


టీడీపీలో చేరిన రామచంద్రయ్య,  ఇక్బాల్                                 


వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య ఎన్నికలకు కొన్ని రోజుల ముందు టీడీపీలో చేరారు. వైసీపీ ఫిర్యాదుతో శాసనమండలి చైర్మన్ మోషేన్‌ రాజు రామచంద్రయ్య అనర్హత వేటు వేశారు. మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా టీడీపీలో చేరారు. ఆయనపై కూడా  అనర్హతా వేటు వేశారు.  దీంతో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.  


ఎమ్మెల్యే కోటాలో పూర్తి బలమున్న టీడీపీ                               


ఇటీవలి ఎన్నికల్లో కూటమి  భారీ విజయం సాధించడంతో రెండు స్థానాలూ టీడీపీకే దక్కనన్నాయి. వైసీపీ పోటీ పెట్టే  అవకాశం లేకపోవడంతో.. ఏకగ్రీవం అవుతాయని అంచనా వేస్తున్నారు. రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున  175 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే వైఎస్ఆర్‌సీపీకి  పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటారు. పోటీ చేయడానికి అవసరమైన సభ్యుల బలం కష్టం కాబట్టి.. పోటీ చేయాలనే ఆలోచన చేయరని భావిస్తున్నారు.                         


రాజీనామా చేసిన వారికే టీడీపీ చాన్స్ ఇస్తుందా ?                         


రాజీనామా చేసిన ఇద్దరూ టీడీపీలో చేరారు. అందుకే టీడీపీ వారిద్దరికీ మళ్లీ చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వీరు పార్టీ మారారని అనర్హతా వేటు వేశారు. ఒక వేళ వేట వేయకపోతే సాంకేతికంగా వీరు వైసీపీ సభ్యులుగా ఉండేవారు. కానీ ముందుగానే అనర్హతా వేటు వేయడంతో ఉపఎన్నికలు వచ్చాయి. 


మరో ఇద్దరు ఎమ్మెల్సీలపైనా వేటు - వాటికీ త్వరలో ఎన్నికలు                                        


వీరిద్దరితో పాటు వంశీ కృష్ణ శ్రీనివాస్, ఇందుకూరి రఘురాజులపైనా అనర్హతా వేటు వేశారు. వీరిలో ఒకరు జనసేన పార్టీలో మరొకరు ఏ పార్టీలోనూ చేరలేదు. రఘురాజు కుటుంబం టీడీపీలో చేరింది. ఇప్పుడు ఈ స్థానాలకూ ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. త్వరలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికల నోటిపికేషన్ కూా వచ్చే అవకాశం ఉంది.