ఢిల్లీ లిక్కర్ కేసు - కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు (Kavitha) మరోసారి షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) మరో 14 రోజులు పొడిగించింది. మంగళవారంతో ఆమె కస్టడీ ముగియగా.. ఈడీ, సీబీఐ అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరు పరిచారు. కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మే 7 వరకూ కవితకు కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా తీర్పు వెలువరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇదివరకే ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇంచార్జి వర్మతో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు జనసేనాని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణపై అగ్రనేతల దృష్టి ఎప్పుడు ? హంగామా లేకుండా సాగుతున్న బీజేపీ ప్రచారం !
తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రచారం అంత ఉత్సాహంగా సాగడం లేదు. బీజేపీ తెలంగాణ ముఖ్యనేతలు తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. వేరే నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం లేదు. జాతీయ స్థాయి నేతల షెడ్యూల్‌పై స్పష్త కనిపించడం లేదు. బహిరంగ సభలు, ముఖ్యనేతలు ఇప్పటివరకైతే ఎవరూ కనిపించలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎన్డీఏ కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించినట్లే - విశాఖలో సీఎం జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ తమ వైఖరి స్పష్టం చేయాలని సీఎం జగన్ డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీవి ఎన్నికల కోసం పొత్తులు.. రాష్ట్ర ప్రయోజనాలపై పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కార్మిక సంఘం నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు ఎండాడలో ముఖ్యమంత్రి జగన్ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై నివేదించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర చేయనున్నారు. కేసీఆర్ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ప్రణాళికలు అన్ని సిద్ధం చేశారు. దీంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు సంబంధించిన బస్సు కు ఈ రోజు తెలంగాణ భవన్ లో ప్రత్యేక పూజలు చేయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి