హైదరాబాద్​లో భారీ వర్షానికి మొసలి పిల్ల నాలా నుంచి కొట్టుకుని వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఖైరతాబాద్​ చింతల్​బస్తీ వద్ద మొసలి పిల్ల ఒడ్డుకు చేరింది. హైదరాబాద్ సిటీలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సిటీలో నాలాలు పొంగిపొర్లాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయి. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ చింతల బస్తీలోని నాలాలో మొసలి పిల్ల ప్రత్యక్షం అయ్యింది. మొసలి పిల్లను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు.


హైదరాబాద్ నగరం ఖైరతాబాద్ చింతల్ బస్తీ, ఆనంద్ నగర్ల మధ్య ఉన్న నాలాలో మొసలి పిల్ల ప్రవాహ ఉధృతికి కొట్టుకు రావడం కలకలం రేపింది. నాలాలో ముసలి పిల్ల కొట్టుకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బల్కాపూర్ నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహానికి ముసలి పిల్ల నీటిలో కొట్టుకు వచ్చింది. ఆనంద్ నగర్ చింతల్ బస్తి మధ్య నూతన వంత నిర్మాణం కోసం కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో ఈ ముసలి పిల్ల ఒడ్డుకు చేరింది. 


ముసలి పిల్లను గమనించిన స్థానికులు అటవీశాఖ, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. నాలపై నిర్మాణ పనులు మూడు నెలలు గడుస్తున్న పూర్తి కాకపోవడం, అదే ప్రాంతంలో మొసలి పిల్ల కొట్టుకురావడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  


ఖైరతాబాద్ చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల హ‌ల్ చ‌ల్ చేసింది. నగరంలో ఒకవైపు గణేష్ నిమజ్జ‌నం కొనసాగుతూ ఉండ‌గా.. మరోవైపు నగరంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వరద నీరు రోడ్లపై పొంగిపొర్లుతూ చెరువులను తలపించాయి. బల్కాపూర్ నాలాలో ఈ మొసలి పిల్ల కొట్టుకొచ్చిందని తెలిపారు. బంజారాహిల్స్ తదితర ప్రాంతాల మీదుగా ఈ నాలా వస్తుందని చెబుతున్నారు. ఈ మొసలి పిల్ల 5 అడుగుల పొడవు వరకు ఉండవచ్చని చెప్పారు.


ప్రవాహంలో తల్లి మొసలి కూడా ఉందేమోనని కొంత మంది ఆందోళన వ్యక్తం చేశారు. నాలా పక్కనే ఇళ్లు ఉన్నాయని.. అర్ధరాత్రి ఎక్కడ నివాసాలలోకి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాపై నిర్మాణ పనులు 3 నెలలైనా పూర్తి కాలేదని చెబుతున్నారు. మరోవైపు.. మొసలిని చూసేందుకు సమీపంలోని కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 


హైదరాబాద్ శివార్లలోని హిమాయత్ సాగర్‌లో, దాని సమీపంలోని నాలాలో మొసళ్లు కనిపించాయని గతంలోనూ వార్తలు వచ్చాయి. బుధవారం కురిసిన భారీ వర్షం అనంతరం ఇక్కడి నాలా నుంచే మొసలి పిల్ల కొట్టుకొచ్చిందేమోనని ఖైరతాబాద్ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భయభ్రాంతులకు గురైన స్థానికులు ముసలి పిల్లను కర్రలతో బెదిరించే ప్రయత్నం చేశారు. మొసలి పిల్ల కదిలి ముందుకు రావడంతో అక్కడి వారంతా తలో దిక్కు పరుగులు తీశారు. 


పిల్ల ముసలిని పట్టుకునేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అటవీశాఖ అధికారులు, జిహెచ్ఎంసి సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నాలాల ముసలి పిల్ల ఒకటే ఉందా? లేక ఇంకా ఎన్ని ఉన్నాయి? అని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ముసలి పిల్ల ప్రస్తుతం ఎక్కడ నుంచి కొట్టుకు వచ్చిందని దానిపై అధికారులు దృష్టి పెట్టారు.