Congress Six Guarantees : తెలంగాణ ( Telangana)లో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ (Six Guarantees)ల అమలుపై కసరత్తు మొదలు పెట్టింది.  కాంగ్రెస్ (Congress party ) ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన ప్రభుత్వం....మిగిలిన వాటి అమలు, నిధులపై లెక్కలు వేసుకుంటోంది. 5వందల గ్యాస్ సిలిండర్, మహిళలకు 2వేల 500 నగదు బదిలీ, పెన్షన్ల పెంపు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల నగదుసాయం, కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. అందులో చాలా నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Dy Cm Mallu Bhatti Vikramarka ),  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్ (Manikrao Thakre )రేతోపాటు పలువురు మంత్రులు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.


మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, లోక్ సభ టికెట్ల కేటాయింపు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై సుదీర్ఘంగా చర్చించారు. ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరించాలని నిర్ణయించింది. 5వందల గ్యాస్ సిలిండర్, మహిళలకు 2వేల 500 నగదు బదిలీ, పెన్షన్ల పెంపు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల నగదుసాయం, కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీ వెల్లడించారు. ఇటు పార్టీ, అటు ప్రభుత్వం తరపున ప్రతినిధులను నియమించి గ్రామ సభలను నిర్వహించనుంది. గ్రామసభ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, అందరి ఆమోదం తెలిపిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనుంది. పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నోడల్‌ అధికారిని నియమించనుంది ప్రభుత్వం. పథకాల అమలులో తమ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే అడ్డగోలుగా తీసుకుంటామంటే నడవదని, నిజమైన అర్హులకే ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 5 లక్షల విద్యా భరోసా కార్డులు వంటి పథకాలపై ఎలాంటి చర్చ జరగనట్లు తెలుస్తోంది. 


నామినేటెడ్‌ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశంలో చెప్పారు. నెల రోజుల్లోనే నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. గతంలో ఎవరెవరికి హామీ ఇచ్చామో, ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంటుందో జాబితా సిద్ధం చేయాలని పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి సూచించారు. పదేళ్ల పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు అధికారానికి దూరంగా ఉన్నారని సమావేశంలో ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారని, పోస్టుల భర్తీ ఆలస్యం చేయడం మంచిది కాదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.  సంక్రాంతి పండుగ తర్వాల లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించాలని పీఏసీ నిర్ణయించింది. అసెంబ్లీ అభ్యర్థులను ఆలస్యం అయిందని, ఎంపీ అభ్యర్థుల విషయంలో ముందుకు ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎంపీ, శాసనసమండలి టికెట్ల వ్యవహారం హైకమాండే చూసుకుంటుందని స్పష్టం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.