TS CM Revanth Reddy Oath ceremony Live Updates : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి - 6 గ్యారెంటీలపై తొలి సంతకం, దివ్యాంగురాలికి ఉద్యోగం

Revanth Reddy oath ceremony : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ అప్‌డేట్స్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఇతర అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను రీఫ్రెష్ చేయండి

ABP Desam Last Updated: 07 Dec 2023 02:15 PM
సీఎంగా రేవంత్ తొలి సంతకం - దివ్యాంగురాలికి ఉద్యోగం

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే  ఆయన 6 గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం చేసి ఆమెకు నియామక పత్రం అందించారు.

రేపు ఉదయం ప్రజాభవన్ లో ప్రజాదర్బార్: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో రేపు ఉదయం 10 గంటలకు ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో ప్రజలందరికీ ఆహ్వానం పలికారు. ప్రజలు ఎప్పుడైనా ప్రజాభవన్ కు రావొచ్చని, ఈ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని స్పష్టం చేశారు. ప్రజా భవన్ వద్ద కంచెలు తొలగించినట్లు చెప్పారు.

పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పారు.

'జై సోనియమ్మ' అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

'జై సోనియమ్మ' అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగం ప్రారంభించారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దశాబ్ద కాలంగా తెలంగాణలో మానవ హక్కులకు భంగం కలిగిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్య ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమాన అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పీఎం మోదీ అభినందనలు

తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

కాంగ్రెస్ అగ్రనేతలకు సీఎం వీడ్కోలు

సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇతర నేతలకు ఆయన వీడ్కోలు పలికారు.

ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి అభివాదం

ఎల్బీ స్టేడియం వేదిక పైనుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అభివాదం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, ఖర్గే, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఆయన ప్రజలకు అభివాదం చేశారు.

గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు

పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసైకు వీడ్కోలు పలికారు.

మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం

తెలంగాణ మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.

మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం

తెలంగాణ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. తుమ్మల ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.

మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం

తెలంగాణ మంత్రిగా దనసరి అనసూయ (సీతక్క) ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ములుగు నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఆమెతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు.

మంత్రిగా కొండా సురేఖ ప్రమాణ స్వీకారం

తెలంగాణ మంత్రిగా కొండా సురేఖ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె వరంగల్ ఈస్ట్ నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం

మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు.

మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం

మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.


మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.

మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం

మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు.

మంత్రిగా దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం

మంత్రిగా దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు.

మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం

తెలంగాణ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు.

మంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం

తెలంగాణ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇతర మంత్రులు సైతం ఇప్పుడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. 


తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి - ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

ఎల్బీ స్టేడియానికి చేరుకున్న గవర్నర్ తమిళిసై

గవర్నర్ తమిళిసై ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. కాసేపట్లో రేవంత్ రెడ్డితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

వేదికపైకి చేరుకున్న రాహుల్, ప్రియాంక

ఎల్బీ స్డేడియంలో వేదికపైకి సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అనంతరం ప్రజలకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే సైతం వేదికపైకి చేరుకున్నారు.

ఎల్బీ స్టేడియానికి రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీతో కలిసి ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

కాసేపట్లో ఎల్బీ స్టేడియానికి గవర్నర్ తమిళిసై

ఎల్బీ స్టేడియానికి కాసేపట్లో గవర్నర్ తమిళిసై హాజరు కానున్నారు. అనంతరం ఆమె రేవంత్ రెడ్డితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే ఎల్బీ స్డేడియానికి కాంగ్రెస్ అగ్రనేతలు, అమర వీరుల కుటుంబాలు హాజరయ్యారు.

ఎల్బీ స్టేడియానికి కాంగ్రెస్ అగ్రనేతలు - కాసేపట్లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్య నేతలు ఎల్బీ స్డేడియానికి చేరుకున్నారు. కాసేపట్లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీఆర్ఎస్ తరఫున గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. మరోవైపు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు సైతం భారీగా తరలివచ్చారు. మొత్తం 3 వేదికలు ఏర్పాటు చేయగా, 500 మంది కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఆయన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

పెద్దమ్మ గుడికి రేవంత్ రెడ్డి - అనంతరం నేరుగా ఎల్బీ స్టేడియానికి

ప్రమాణ స్వీకారానికి ముందు రేవంత్ రెడ్డి తొలుత జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి గుడికి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. మార్గమధ్యలో గన్ పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించనున్నారు.

ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు - అనంతరం కాంగ్రెస్ కృతజ్ఞత సభ

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో 3 స్టేజీలు ఏర్పాటు చేశారు. ప్రధాన స్టేజీకి ఇరువైపులా రెండు  వేదికలు సిద్ధం చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ కృతజ్ఞత సభ ఏర్పాటు కానుంది.

వీళ్లే రేవంత్ టీం- రాజ్‌భవన్‌కు వివరాలు అందజేత 

ఉత్కంఠకు తెరవీడి. తెలంగాణ మంత్రివర్గంలో చోటు ఎవరికో ప్రస్తుతానికి క్లారిటీ వచ్చింది. తెలంగాణ మంత్రివర్గంలో శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్కకు చోటు దక్కింది. 

వీళ్లే రేవంత్ టీం- రాజ్‌భవన్‌కు వివరాలు అందజేత 

ఉత్కంఠకు తెరవీడి. తెలంగాణ మంత్రివర్గంలో చోటు ఎవరికో ప్రస్తుతానికి క్లారిటీ వచ్చింది. తెలంగాణ మంత్రివర్గంలో శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్కకు చోటు దక్కింది. 

హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక- స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నారు. వాళ్లకు రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. 

Background

Telangana CM Revanth reddy Oath Ceremony live updates: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా ఆయన నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమాన్ని భారీగా నాయకులు హాజరుకానున్నారు. ఏఐసీసీ అగ్రనేతలంతా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రానున్నారు. 


మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం పది పదిన్నర మధ్యలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అందర్నీ కలిసి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. 


ఏఐసీసీ నేతలతో సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి పార్లమెంట్‌ భవనానికి చేరుకున్నారు. సమావేశాలు జరుగుతున్న వేళ చాలా మంది ఎంపీలు అక్కడ కనిపించారు. వారంతా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఆయనకు స్వీట్స్ తినిపించి అభినందనలు తెలియజేశారు. అందరితో వ్యక్తిగతంగా మాట్లాడిన రేవంత్‌ ఇవాళ జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించారు. 


రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను తెలంగాణ సీఎస్ శాంతి కుమారి పరిశీలించారు. ఎల్బీ స్టేడియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ రవి గుప్తా, అడిషనల్ డీజిలు సీవీ ఆనంద్, శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్యా, ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, రిజ్వి, జలమండలి ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనల్డ్ రాస్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, రాజ్ భవన్ కార్యదర్శి సురేంద్రమోహన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మున్సీ తదితరులు హాజరయ్యారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లలో ఏ లోపాలు ఉండకూడదని సీఎస్ శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు, స్టేడియంలో మంచి నీటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారని, వారికి ప్రత్యేకంగా గ్యాలరీలతోపాటు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. వాహనాల పార్కింగ్, బందోబస్త్ లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. 


రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే వేదికకు లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక సిద్ధం చేయనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలకనున్నారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.             


రేవంత్‌తోపాటు మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయిస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల ఫైల్‌లో రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.