Tata Sierra EV To Rival Hyundai Creta Electric Soon: ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో తన పట్టును మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి టాటా మోటార్స్ రెడీ అయింది. కస్టమర్లు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV) ఈ నెల చివరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సరికొత్త మిడ్‌సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ అయితే హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి సుజుకి ఈ విటారా, మహీంద్రా బిఈ 6 మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ సియెర్రా మోడళ్లతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో డిజైన్ పరంగా చాలా మార్పులు ఉండనున్నాయి. కారు ముందు భాగంలో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, కొత్త బంపర్లు, ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ ఈ ఈవీకి అట్రాక్టివ్ లుక్ ఇస్తాయి.

Continues below advertisement

Read Also: National Highways News: నేషనల్ హైవేలపై రాత్రి పూట లైట్లు ఎందుకు ఉండవు.. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ  క్లారిటీ ఇదే !

ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, లగ్జరీ ఫీచర్స్..సియెర్రా ఈవీ లోపలి భాగాన్ని టాటా మోటార్స్ చాలా ప్రీమియంగా డిజైన్ చేస్తోంది. దీని క్యాబిన్‌లో లార్జ్ డిజిటల్ స్క్రీన్స్‌తో కూడిన మోడర్న్ డాష్‌బోర్డ్ ఉండనుంది. బేస్ వేరియంట్లలో డ్యుయల్-స్క్రీన్ సెటప్ ఇస్తుండగా, టాప్ ఎండ్ ట్రిమ్స్‌లో ఏకంగా ట్రిపుల్-స్క్రీన్ అరేంజ్‌మెంట్‌ను ఆఫర్ చేయనున్నారు. ఇవే కాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ టెయిల్‌గేట్ లాంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉంటాయి. డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన 12-స్పీకర్ల జేబీఎల్ (JBL) ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయి.

Continues below advertisement

Read Also: Best 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుండి అల్కాజార్ వరకు.. అధిక మైలేజీ ఇచ్చే బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే

పవర్‌ఫుల్ బ్యాటరీ, క్వాడ్ వీల్ డ్రైవ్..మెకానికల్ పరంగా చూస్తే టాటా ఎలక్ట్రిక్ లైనప్‌లో ఈ కారు కర్వ్ ఈవీ, హారియర్ ఈవీల మధ్య ప్లేస్ కానుంది. కస్టమర్ల కోసం 55 kWh, 65 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందుబాటులో ఉంచనున్నారు. హయ్యర్ వేరియంట్లలో భారీ రేంజ్ ఇచ్చే 75 kWh బ్యాటరీ ప్యాక్ కూడా లభించే ఛాన్స్ ఉంది. ఎంట్రీ లెవెల్ మోడళ్లలో సింగిల్-మోటర్ సెటప్ ఇస్తుండగా, టాప్ వేరియంట్లలో డ్యుయల్ మోటర్లతో కూడిన ఆల్-వీల్-డ్రైవ్ (AWD) క్యాపబిలిటీని జోడిస్తున్నారు. హారియర్ ఈవీలో వాడిన క్వాడ్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని ఇందులో కూడా ఉపయోగించనున్నారు.

తక్కువ ధరకే కారు కొనేలా బాస్ ప్రోగ్రామ్..ఈ కారులో టాటా మోటార్స్ తీసుకొస్తున్న మరో పెద్ద హైలైట్ 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (BaaS) ప్రోగ్రామ్. ఈ సరికొత్త మోడల్ ప్రకారం కస్టమర్లు బ్యాటరీ లేకుండా కేవలం కారును మాత్రమే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీ కోసం నెలకు కొంత అమౌంట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూపంలో పే చేస్తే సరిపోతుంది. దీనివల్ల కారు ఇనిషియల్ కాస్ట్ భారీగా తగ్గి, ఎలక్ట్రిక్ కార్లను సొంతం చేసుకోవడం మిడిల్ క్లాస్ బడ్జెట్ పరిధిలోకి వస్తుంది.