Tamil Nadu tvk government formation:   తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు కీలక మలుపు తిరిగాయి.  టీవీకే  అధినేత విజయ్‌కు వామపక్ష పార్టీలైన సీపీఐ,  సీపీఐ(ఎం)  బేషరతు మద్దతు ప్రకటించాయి. వీసీకే కూడా మద్దతు తెలిపింది.  రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీల నేతలు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన అనిశ్చితికి తెరదించుతూ, అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఈ మద్దతు అత్యంత కీలకంగా మారింది.   

Continues below advertisement

తొలుత టీవీకే సంప్రదింపుల తీరుపై విసికె అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది.  డీఎంకే కూటమిలోని ప్రధాన మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం తమిళ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. వామపక్షాల నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మౌన సమ్మతి  ఉందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ లేదా అన్నాడీఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి, విజయ్ నేతృత్వంలో ఒక ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఉత్తమమని డీఎంకే భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తన మిత్రపక్షాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి విజయ్‌కు బాటలు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.                               

Continues below advertisement

 విజయ్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరనున్నట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాల మద్దతు, విసికె , కాంగ్రెస్,  టీవీకే బలం మ్యాజిక్ ఫిగర్‌ , కూడా చేరితే ఎటువంటి ఆటంకం లేకుండా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల తర్వాత ఒక సినీ నటుడి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటం తమిళనాట చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది.