Tata Nexon Pure Plus PS Variant Leaked:  టాటా మోటార్స్ కు నెక్సాన్ ఒక పెద్ద 'క్యాష్ కౌ' లాంటిది. అంటే కంపెనీకి అత్యధిక లాభాలను, అమ్మకాలను తెచ్చిపెట్టే మోడల్ ఇది. ప్రస్తుతం సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ నెక్సాన్ తన క్రేజ్ ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. సేల్స్ ను మరింత పెంచే ప్లాన్ లో భాగంగా టాటా ఇప్పుడు 'ప్యూర్ ప్లస్ పీఎస్' (Pure+ PS) అనే కొత్త వేరియంట్‌ను సిద్ధం చేసింది. ఇందులో పీఎస్ (PS) అంటే పనోరమిక్ సన్‌రూఫ్ అని అర్థం. అధికారికంగా లాంచ్ అవ్వకముందే ఈ కారు ఇంటీరియర్ వివరాలు బయటకు వచ్చాయి.

Continues below advertisement

అందరికీ అందుబాటులో పనోరమిక్ సన్‌రూఫ్..ప్రస్తుతం ఇండియన్ కస్టమర్లు కారులో ఎక్కువగా కోరుకునే ఫీచర్ సన్‌రూఫ్. ఇప్పటివరకు పనోరమిక్ సన్‌రూఫ్ కావాలంటే కనీసం రూ. 11.32 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉన్న క్రియేటివ్ ప్లస్ పీఎస్ వేరియంట్ కొనాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త ప్యూర్ ప్లస్ పీఎస్ వేరియంట్ లాంచ్ అయితే సామాన్యులకు కూడా ఈ లగ్జరీ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్ ధర రూ. 9.23 లక్షల నుండి ప్రారంభం అవుతుండగా, ఈ కొత్త పీఎస్ వేరియంట్ ధర అంతకంటే కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. దేశంలో పనోరమిక్ సన్‌రూఫ్ తో లభించే అత్యంత చౌకైన కారుగా ఇది నిలవబోతోంది.

కొత్తగా చేరిన ఫీచర్లు..లీకైన ఫోటోల ప్రకారం ఈ కొత్త వేరియంట్ లో సన్‌రూఫ్ తో పాటు 'క్రూయిజ్ కంట్రోల్' ఫీచర్ కూడా కనిపిస్తోంది. సాధారణంగా ఈ ఫీచర్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలోనే ఉండేది. ఇప్పుడు బడ్జెట్ వేరియంట్ లోనే స్పీడ్ సెట్ చేసుకునే టోగుల్స్ ఇస్తుండటం విశేషం. వీటితో పాటు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, హెచ్‌డీ రియర్ వ్యూ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఈ ప్యాకేజీలో భాగం కానున్నాయి.

Continues below advertisement

ఇంజిన్ ఆప్షన్లు..నెక్సాన్ ప్యూర్ ప్లస్ పీఎస్ వేరియంట్ లో పవర్ ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఇందులో టర్బో పెట్రోల్ (6MT/6AMT), టర్బో డీజిల్ (6MT/6AMT) తో పాటు సీఎన్‌జీ వెర్షన్ కూడా లభించే అవకాశం ఉంది. దేశంలో నాలుగు రకాల ఇంధన ఆప్షన్లతో (పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఈవీ) దొరుకుతున్న ఏకైక కారు నెక్సాన్ కావడం గమనార్హం.

మార్కెట్ లో పోటీ..ఈ కొత్త వేరియంట్ లాంచ్ అయితే మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వంటి మోడళ్లకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు ఇవ్వడం టాటాకు ప్లస్ పాయింట్ కానుంది. సేఫ్టీ విషయంలో ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ సంపాదించిన నెక్సాన్, ఇప్పుడు ఇలాంటి క్రేజీ ఫీచర్లతో యూత్ ను మరింతగా ఆకట్టుకోనుంది. ఈ మోడల్ అతి త్వరలోనే షోరూమ్ లలో సందడి చేయబోతోంది.