Weather Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో వాతావరణం వేడెక్కుతోంది. గత కొన్ని రోజులుగా 15 డిగ్రీలుగా నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని ప్రాంతాలల్లో 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు.
దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది. ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, వాతావరణం మరింత వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచన లేదని కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతాయిని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పారు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 17.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామలో 18.6 డిగ్రీలు, కళింగపట్నంలో 22 డిగ్రీలు, బాపట్లలో 19.3 డిగ్రీలు, అమరావతిలో 19.3 డిగ్రీలు, విశాఖపట్నంలో 22.6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా మారింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ సైతం భారీగానే పెరిగాయి. ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 15.5 డిగ్రీలు నమోదైంది. అనంతపురంలో 17.5 డిగ్రీలు, నంద్యాలలో 18.5 డిగ్రీలు, తిరుపతిలో 19 డిగ్రీలు, కర్నూలులో 21.1 డిగ్రీలు, కడపలో 21.6 డిగ్రీల మేర రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
Telangana Weather Updates: తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో వాతావరణం వేడెక్కుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యల్పంగా నల్గొండలో కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదు కాగా, ఆదిలాబాద్ లో 18.1, భద్రాచలంలో 20.8, దుండిగల్‌లో 18.2, మెదక్ జిల్లాలో 19 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.
Also Read: Gold-Silver Price: నేడు పసిడి ప్రియులకు స్వల్ప ఊరట! తగ్గిన బంగారం ధర, వెండి రేటు నేడు ఎంతంటే