NASA's Sun Smiling PIc: ఎప్పుడూ భగభగ మండే సూర్యుడు.. నవ్వడం మీరు చూశారా? సూర్యుడు నవ్వడం ఏంటి? అనుకుంటున్నారా? నాసా (National Aeronautics and Space Administration) తాజాగా రిలీజ్ చేసిన ఫొటోలను చూస్తే మనకు ఇదే అనిపిస్తుంది. సరిగ్గా చూస్తే అలానే కనిపిస్తుంది. 






అవును కదా


ఈ ఫోటోలు, వీడియోలు చూస్తుంటే స్మైలీ సన్నీ ఫన్నీగా కనిపిస్తున్నాడు కదా. నాసా రిలీజ్ చేసిన రీసెంట్ ఫోటోలు, వీడియోల్లో చూస్తే... సూర్యుడు స్మైలీ ఫేస్ తో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. నాసాకు చెందిన సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ ఈ ఫోటోలు, వీడియోలు తీసింది.






సూర్యుడిని నిశితంగా పరిశీలించటమే ఈ అబ్జర్వేటరీ పని. గడచిన వారం రోజులుగా సూర్యుడిపై మొత్తం మూడు సోలార్ ఫ్లేర్స్ ఏర్పడ్డాయి. 23 కొరోనల్ మాస్ ఎజక్షన్స్ జరిగాయి. జియోమాగ్నటిక్ తుపాన్లు అయితే ఏం నమోదు కాలేదు.


అంటే


సోలార్ ఫ్లేర్స్ అంటే సూర్యుడి నుంచి విడుదలయ్యే విపరీతమైన రేడియేషన్ . సూర్యుడిపైన కొన్ని స్పాట్స్ ఉంటాయి...వాటి నుంచి మాగ్నటిక్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది.  అల్ట్రా వయొలెట్ లైట్ తో చూసినప్పుడు సూర్యుడిపై డార్క్ ప్యాచెస్ లా కనిపిస్తూ ఉంటాయి. వీటినే కరోనల్ హోల్స్ అంటారు. వీటి నుంచి విపరీతమైన వేడి, రేడియేషన్  స్పేస్ లోకి వస్తూ ఉంటుంది. సో అలా ఏర్పడిన సోలార్ ఫ్లేర్స్ డార్క్ ప్యాచెస్ పైన కమ్మేసినప్పుడు ఇలా స్మైలీ ఫేస్ తో కనిపించి సూర్యుడు సందడి చేశాడన్న మాట.



Also Read: Amit Shah On Sardar Patel: పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే, భారత్ మరోలా ఉండేది: అమిత్ షా